Home

»

Latest News

వరుణ్‌తేజ్ సినిమాలో అతడూ బాక్సరే

Apr 14, 2020 2:07PM

 

టాలెంటెడ్ తెలుగు ఆర్టిస్టుల్లో నవీన్ చంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. 'అందాల రాక్షసి'లో హీరోగా కావచ్చు, 'అరవింద సమేత వీరరాఘవ'లో విలన్‌గా కావచ్చు, 'ఎవరు'లో విభిన్న పాత్రలో కావచ్చు... తనదైన నటనతో పాత్రలను రక్తి కట్టించాడు. ఒకపక్క హీరోగా చిన్న సినిమాలు చేస్తూ, మరోపక్క పెద్ద సినిమాల్లో నవీన్ చంద్ర ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అతడి చేతిలో హీరోగా రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ బిజీగా ఉన్నాడు. కీర్తీ సురేష్ 'మిస్ ఇండియా'తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ నవీన్ చంద్ర నటిస్తున్నాడు.

వరుణ్ తేజ్ సినిమాలో నవీన్ చంద్రది కూడా బాక్సర్ రోల్. క్యారెక్టర్ కోసం రోజు విడిచి రోజూ ఉదయం వేళల్లో అతడు బాక్సింగ్‌లో ట్రయినింగ్ తీసుకుంటున్నాడు. అలాగే, మజిల్స్ పెంచుతున్నాడు. అయితే.... అతడు విలన్‌గా కనిపిస్తాడా? పాజిటివ్ రోల్‌లో కనిపిస్తాడా? అనేడి ఇంకా క్లారిటీ లేదు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతానికి ఆగింది. మళ్లీ షూటింగులు స్టార్ట్ అయినప్పుడు అందరితో పాటు షూటింగ్ స్టార్ట్ చేయాలని టీమ్ వెయిట్ చేస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబీ, వరుణ్ తేజ్ కజిన్ సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com