ENGLISH | TELUGU  

ఓడలు బళ్లు... బళ్లు ఓడలు అవ్వడం అంటే ఇదే

on Jul 5, 2017

‘అష్టాచెమ్మ’రిలీజవ్వగానే... అందులో నానిని చూసిన జనాలందరి నోటా ఒక్కటే మాట. ‘ఎవరీ కుర్రాడు.. పరిచయం ఉన్నముఖంలా ఉందే’అని. కొంతమంది ఫేస్ వాల్యూ అలా ఉంటుంది మరి. 

 


‘అలా మొదలైంది‘ విడుదలైంది. ఈ సినిమా దెబ్బకు రాత్రికి రాత్రి యూత్ ఐకాన్ గా మారాడు నాని. ఇక అమ్మాయిలేమో... తమకు తాము నిత్యామీనన్ లుగా ఫీలైపోయారు. దటీజ్ నాని.   

 


మధ్యలో ‘భీమిలీ కబడ్డీ జట్టు’అని ఓ సినిమా వచ్చింది. పేదరికంలో మగ్గిపోతూ, కోరికల్ని, లక్ష్యాన్ని చంపుకొని బతుకుతున్న కుర్రాడి పాత్ర అందులో నానిది. చివరకు చనిపోతాడు కూడా. సమాజిక వ్యవస్థలో అలాంటి వాళ్లు సందుకొకళ్ళు కనిపిస్తుంటారు. అలాంటి వారందరూ నానిలో తమకు తాము చూసుకున్నారు. 


ఒక్క మెతుకు చూస్తే చాలు... అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి. అలాగే... ‘పైసా’సినిమాలో చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో మందు తాగుతూ నాని చేసిన ఒక్క సీన్ చాలు అతను ఏ స్థాయి నటుడో చెప్పడానికి. విశేషం ఏంటో తెలుసా? ఆ సీన్ నిడివి దాదాపు 5 నిమిషాలు. పైగా మధ్యలో ‘నో కట్’. దర్శకుడు కృష్ణవంశీ కెమెరా పాతేసి ఊరుకున్నాడు. కానీ.. నాని!.. తడుముకోకుండా, చెలరేగిపోయి నటించాడు. సినిమా సరిగ్గా ఆడకపోయినా... నటునిగా నానీని పది మెట్ల పైన కూర్చోబెట్టింది ‘పైసా’. నమ్మకపోతే.. ఓ సారి సరదాగా ఆ సీన్ చూడండి. 

 


రాజమౌళీ ‘ఈగ’లో తొలి ముప్ఫై నిమిషాలే కనిపిస్తాడు నాని. కానీ... సినిమా అంతా ఇంటర్నల్ గా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. ఇక ‘ఎవడే సుబ్రమణ్యం’.. పై సినిమాల్లోని పాత్రలకు ఈ పాత్రకు అస్సలు పొంతనే ఉండదు. తెలివైన స్వార్థపరుడు. ఈజీగా ఎదగాలనుకునే మెంటాలిటీ.  ఓ విధంగా చెప్పాలంటే చదువుకున్న  మూర్ఱుడు. ఇదంతా ఫస్టాఫ్ల లోనే. సెకండా హాఫ్ లో స్నేహితుడు పుణ్యమా అని రియలైజ్ అయి.. భౌతికంగా లేని స్నేహితుడితో... మానసికంగా ప్రయాణం చేస్తాడు. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ‘పిల్ల జమీందార్’కూడా అంతే...  జీవితం అంటే ఏంటో తెలుసుకొనే ఇంకో రకం కేండిడేట్ ఆ సినిమాలో.  రెండు పాత్రల సోల్ ఒకటే అయినా... బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. 

 

నాని కెరీర్ సమూలంగా మార్చేసిన సినిమా అంటే మాత్రం ‘భలే భలే గాడివోయ్’సినిమానే. చెబితే కాస్త అతిశయోక్తిగా ఉంటుందేమో కానీ... ఆ సినిమాలో కామెడీ టైమింగ్ విషయంలో మెగాస్టార్ చిరంజీవినే గుర్తుకు తెచ్చాడు నాని. మతిమరపు జబ్బు మెండుగా ఉన్న ఆ పాత్రను ఎంచుకోవడమే ఓ ఛాలెంజ్. 

 


‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’. ఇందులో పిరికోడి పాత్ర నానిది. ప్రేమ కోసం రెబల్ గా మారడం.. అది కూడా ఓ కొత్త ఎటెమ్టే.
నాని ‘జెంటిల్ మేన్’చూస్తుంటే.. ఎన్టీయార్ ‘యుగంధర్’సినిమా గుర్తొచ్చింది. రెండు పాత్రల్లో పొంతన లేని వేరషన్. ప్రేక్షకుల్ని తన నటనతో మెస్మరైజ్ చేసేశాడు నాని.  


తర్వాత మజ్నూ, నేను లోకల్. ప్యూర్ లవర్ గా వీటిల్లో కనిపిస్తాడు నాని. ఇక ఇలాంటి పాత్రలు చేయడం నానికి కెమెరాతో పెట్టిన విద్య. 

 

ఎన్ని వేరేషన్లు. ఎవరూ ఊరకే ఎదగరండీ. నానీ తొలి  సినిమా చూసిన ఎవరూ కూడా తను ఈ స్థాయిని అందుకుంటాడని ఊహించి ఉండరు. జనాలు దాకా ఎందుకు...! అతను ఎవరి దగ్గరైతే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడో ఆ డైరెక్టర్లే ఈ స్థాయి ఊహించి ఉండరు. తను హీరో అయిన కొత్తలో ఓ దర్శకుడైతే... ‘‘నా సినిమాలోని ఒక్క పాటకయ్యే ఖర్చు కూడా ఉండదు నీ సినిమా బడ్జెట్ మొత్తం’’ అని అవమానించాడట నానిని. అప్పుడాయన స్టార్ డైరక్టర్ లేండి. ఇప్పుడైతే నాని డేట్స్ సంపాదించడమే ఆ డైరక్టర్ కి చాలా కష్టం. బళ్లు ఓడలు... ఓడలు బళ్లు అవ్వడం అంటే ఇదే మరి. 

 


ఈ నెల 7న ‘నిన్ను కోరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నారు నాని. ఇప్పటికే వరుస విజయాలతో సిక్సర్ కొట్టేశాడు. ఇది కూడా హిట్ అయితే... ఇక నానిని ఎవరూ పట్టుకోలేరన్నది నిజం. నానికి కావాల్సింది. వరుసగా 7వ హిట్. ‘నిన్ను కోరి’ వస్తుంది 7న. 


చూద్దాం ఏమవుతుందో. బెస్టాఫ్ లక్ నానీ...


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.