కుక్క ఉండగా మగాడు అవసరమా...!
on Jul 2, 2016
"నా మాట వినే కుక్క ఉండగా.. ఇంట్లో మగాడు ఉండడం అవసరమా" అంటోంది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. చిన్న సినిమాలతోనే కెరీర్ ను మొదలెట్టినప్పటికీ.. తర్వాతర్వాత కొన్ని పెద్ద సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేస్తూ పాపులర్ అయిన నర్గీస్ ఇప్పుడు బాలీవుడ్ లో రూపొందే దాదాపు అన్నీ సినిమాల్లోనూ ఏదో విధంగా భాగస్వామి అవుతోంది. ఇటీవల ఈ భామ ఓ బాలీవుడ్ ప్రముఖుడితో డేటింగ్ చేస్తోందని టాక్ వచ్చింది. దాంతో.. నర్గీస్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పై విధంగా కామెంట్ చేసింది. ఇకపోతే.. చిరంజీవి రీఎంట్రీ సినిమాలో నర్గీస్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియదు కానీ మెగా అభిమానులకు మాత్రం ఈ సెలక్షన్ అస్సలు నచ్చలేదు!