ఘనంగా నారా రోహిత్ పెళ్లి.. మీరు కూడా చూసి ఆనందించండి
on Oct 31, 2025

-నారా రోహిత్,సిరి లేళ్ల ల వివాహం
-హైలెట్స్ ఇవే
-హాజరైన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు
ఏ క్యారక్టర్ లోకైనా పరకాయప్రవేశం చేసి సదరు క్యారక్టర్ తో అభిమానులని,ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యగల హీరో నారా రోహిత్(Nara Rohith). తెలుగు సినిమాకి దొరికిన ఇంకో మంచి నటుడు అని కూడా చెప్పుకోవచ్చు. సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ కి కూడా పెట్టింది పేరు. బాణం, సోలో, రౌడీ ఫెలో, అసుర, సావిత్రి,జో అచ్యుతానంద, భైరవం, సుందరకాండ వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. గత ఏడాది సహ నటి సిరి లేళ్ల(Siree Lella)తో రోహిత్ కి ఎంగేజ్మెంట్ జరిగింది.
ఈ మేరకు పెద్దలు నిర్ణయించిన ముహూర్తం మేరకు నిన్న రాత్రి ఆ ఇద్దరి వివాహం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. అజీజ్ నగర్ లో జరిగిన ఈ వివాహ వేడుకకి రోహిత్ పెదనాన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu NaidU)పెద్దమ్మ భువనేశ్వరి , సోదరుడు ఐటి శాఖ మంత్రి లోకేష్(Lokesh)హాజరయ్యి వధూవరులని ఆశీర్వదించారు. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా హాజరయ్యి నూతన దంపతులకి అభినందనలు తెలిపారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మీరు కూడా చూసి ఆనందించండి.
Also Read: బాహుబలి ది ఎపిక్ మూవీ రివ్యూ
సిరి, రోహిత్ లు ప్రతినిధి పార్ట్ 2 అనే చిత్రంలో జంటగా నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సిరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రెంటచింతల.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



