Home

»

Latest News

కరోనా ఎఫెక్ట్: 'శ్యామ్ సింగరాయ్'... మార్పులోయ్!

Apr 14, 2020 9:26AM

 

కరోనా ఎఫెక్ట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద బలంగా పడింది. అందుకు నేచురల్ స్టార్ నాని సినిమాలు ఏమీ అతీతం కాదు. ఆల్రెడీ అతడు తొలిసారి విలన్‌గా నటించిన 'వి' విడుదల వాయిదా పడింది. 'టక్ జగదీష్' షూటింగ్ ఆగింది. విడుదలకు దగ్గరలో ఉన్న సినిమాలు, సెట్స్‌పై ఉన్న సినిమాలపై మాత్రమే కాదు... ఆల్రెడీ అనౌన్స్ చేసిన సినిమాల మీద కూడా కరోనా ఎఫెక్ట్ పడుతోంది. షెడ్యూల్స్ అన్నీ మారుతున్నాయి. 

నాని హీరోగా 'జెర్సీ' వంటి మంచి సినిమా నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ, త‌మ‌ హీరోతో మరో సినిమా 'శ్యామ్ సింగ రాయ్' ప్రకటించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. నాని పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రకటించినప్పుడే... ఈ ఏడాది డిసెంబర్ 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్ 25న విడుదల చేయడం కష్టమనీ, వచ్చే ఏడాది వేసవికి వెళదామని యూనిట్ డిసైడ్ అయిందట. అలాగే, ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పేరు వినిపించింది. ఇప్పుడు ఆయ‌న‌ బదులు 'జెర్సీ'కి మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్ ని తీసుకున్నారట. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకెన్ని మార్పులు జరుగుతాయో? ప్రస్తుతానికి విడుదల తేదీ, సంగీత దర్శకుడు మారారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com