ఇంట్రస్టింగ్ గా 'జెర్సీ' ట్రైలర్
on Apr 12, 2019
నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం 'జెర్సీ'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తునారు. శ్రద్దా శ్రీనాథ్ కథానాయక. కాగా ఈ సినిమా ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు. క్రికెటర్ గా అర్జున్ మైదానంలోకి అడుగుపెట్టడం, సహచర ఆటగాళ్లతో గొడవ పెట్టుకోవడం, శ్రద్ధ తో ప్రేమలో పడటం తదితర సన్నివేశాలతో ట్రైలర్ మొదలైనది. పదేళ్ల తర్వాత అర్జున్ (నాని ) క్రికెట్ కు దూరమై అటు ఉద్యగం లేక ఇటు కుటుంబాన్ని నెట్టుకురాలేక సతమతమవడాన్ని చూపించారు. 'పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలుపెడతా'.. అంటూ నాని ఉద్వేగంతో చెబుతున్న డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది. సితార ఎంటెర్టైన్మంట్స్ బానర్ పై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుద్ రవిచంద్ సంగీతం అందించారు. ఏప్రిల్ 19 న 'జెర్సీ' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.