పవన్ కళ్యాణ్ మహేష్ ప్రభాస్ ల బాటలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ
on Jan 24, 2024
నందమూరి బాలకృష (balakrishna) నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ( mokshagna) సినీ రంగ ప్రవేశం ఖాయమయ్యిందనే విషయం అందరికి తెలిసిందే. బాలకృష కూడా మోక్షజ్ణ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ని వెండి తెర మీద చూస్తామనే ఉత్సాహం నందమూరి అభిమానుల్లో ఉంది.పైగా తను ఎలా నటిస్తాడో అనే క్యూరియాసిటీ కూడా ఫ్యాన్స్ లో రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ నుంచి వస్తున్న తాజా వార్త బాలయ్య ఫ్యాన్స్ లో జోష్ ని తీసుకురావడంతో పాటు నమ్మకాన్ని కూడా తెచ్చింది.
మోక్షజ్ఞ సినిమాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి వెండి తెర మీద తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన అస్త్రాలన్నింటిని కూడా రెడీ చేసుకుంటున్నాడు.అందులో భాగంగా ప్రముఖ నట శిక్షకుడు సత్యానంద్(sathyanand) దగ్గర మోక్షజ్ణ నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ మేరకు ఆ వార్త నిజమనే రీతిలో అన్ని సోషల్ మీడియాల్లోను వార్తలు వస్తున్నాయి. ఈ రోజున టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోలుగా చెలామణి అవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ,ప్రభాస్ లాంటి అగ్ర నటులు కూడా సత్యానంద్ దగ్గరే నటనా ఓనమాలుని నేర్చుకున్నారు.ఇప్పుడు ఈ విషయంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
సత్యానంద్ శిక్షణలో మోక్షజ్ణ నటనలో రాటుదేలి సిల్వర్ స్క్రీన్ మీద విజృంభించాలని అలాగే తన తండ్రి బాలకృష్ణ ని మించిన హీరోగా ఎదగాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇకపోతే మోక్షజ్ణ తొలి చిత్రం కోసం బాలయ్య చాలా పెద్ద కసరత్తే చేస్తున్నాడు. స్టోరీ దగ్గర నుంచి దర్శకుడు తో పాటు ఆ సినిమా నిర్మించే బ్యానర్ ఇలా ప్రతి విషయంలోను చాలా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
Also Read