యూ ట్యూబ్‌లో బాలయ్య, చిరు వార్!
on Dec 22, 2016
ఈ సంక్రాంతికి నువ్వా నేనా అంటూ బాక్సాఫీసు దగ్గర పోటీ పడబోతున్నారు అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ. అయితే అంతకంటే ముందు యూ ట్యూబ్‌లో చిరు, బాలయ్యల యుద్ధం మొదలైపోయింది. గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్, ఖైదీ లోని అమ్మడు - కుమ్ముడు పాట ఈవారమే రిలీజ్ అయ్యాయి. ఇవి రెండు రికార్డులు బ్రేక్ చేయడంలో పోటీ పడుతూ ముందుకు సాగిపోతున్నాయి. గౌతమి పుత్ర శాతకర్ణి ట్రైలర్ 50 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. ఇది యూ ట్యూబ్ రికార్డ్. అతి తక్కువ టైమ్‌లో 1 మిలియన్, 2 మిలియన్,3 మిలియన్ వ్యూస్ సాధించిన వీడియోగా ఈ ట్రైలర్ చరిత్ర సృష్టించింది. దాని వెనుకే.. ఆ రికార్డులు బద్దలు కొట్టుకొంటూ వెళ్తున్నాడు చిరు.
"అమ్మడు కుమ్ముడు " పాట కాపీ అంటున్నా.. ఆ పాట వింటూ ఎంజాయ్ చేస్తున్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. దానికి నిదర్శనంగానే అమ్మడు కుమ్ముడు యూ ట్యూబ్‌ని కుమ్మేస్తోంది. ఈ పాట ని ఇప్పటి వరకూ యూ ట్యూబ్‌లో 48 లక్షల మంది విన్నారు. అతి తొందర్లోనే ఈ పాట కూడా 50 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకోనుంది. అతి తక్కువ సమయంలోనే.. ఆ మైలు రాయి అందుకొన్న బాలయ్య రికార్డుని... చిరు వీడియో బ్రేక్ చేయబోతోంది. బాక్సాఫీసు దగ్గర వీరిద్దరి పోటీ ఎలా ఉంటుందో తెలీదు గానీ.. యూ ట్యూబ్‌లో మాత్రం మహా రసవత్తరంగా సాగిపోతోంది. అభిమానుల్లో సందడి రెట్టింపు చేస్తోంది. క్యారీ ఆన్ చిరు.. బాలయ్యా..