‘అఖండ2’ అద్భుతంగా వచ్చింది.. మనం హిట్ కొడుతున్నాం’
on Nov 21, 2025
కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ2’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను స్పీడప్ చేశారు ప్రొడ్యూసర్స్. అందులో భాగంగానే నవంబర్ 21న కర్ణాటకలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ ‘అఖండ2’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ కన్నడ ప్రేక్షకులను, అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
‘నాకు ధన్యమైన జన్మనిచ్చి మీ అందరిని గుండెల్లో నిలిపిన కారణజన్మునుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మా నాన్నగారు శ్రీనందమూరి తారక రామారావుగారికి నమస్కరిస్తున్నాను. అటు మా నాన్నగారు, ఇటు కన్నడకు రాజ్‌కుమార్‌గారు.. వాళ్లు చేయని పాత్ర లేదు. రాజ్ కుమార్‌గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్న శివన్నకు ఆశీర్వాదం అందిస్తున్నాను. ఉదయం వర్ష సూచన లేదు. మేము హోటల్ నుంచి వచ్చేటప్పటికి కుంభవృష్టి కురిసింది. మళ్లీ వేదికపైకి వచ్చేసరికి వర్షం లేదు. ఇదంతా శివుని ఆజ్ఞ. అఖండ కేవలం తెలుగు సినిమా కాదు, కన్నడ సినిమా కాదు.. ఇది పాన్ ఇండియా సినిమా. కరోనాలో అందరూ భయపడుతున్న సమయంలో మొట్టమొదటి భారతీయ చిత్రంగా అఖండ చిత్రాన్ని విడుదల చేశాం. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలో పిల్లలు ప్రకృతి ధర్మం జోలికి వస్తే భగవంతుడు మనుషులకి ఆవహిస్తాడు అని చూపించడం జరిగింది. యువత మంచిదారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుందో మీరు చూస్తారు. బోయపాటిగారితో నాకు ఇది నాలుగో సినిమా. అఖండ తాండవం సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి పాత్రల్లో జీవించారు. నేను ఏ పాత్ర చేసినా కూడా ఆ పాత్ర నన్ను ఆవహిస్తుంది. ధర్మం కోసం జీవించాలి, సత్యం కోసం పోరాడాలి, అన్యాయం ముందు తలవంచకూడదు అని మన సనాతన హైందవ ధర్మం చెప్పింది. ఈ సినిమాలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. నిర్మాత గోపిగారు ఎక్కడ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. ఆయనకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. తమన్ థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకి శివుడు పూనాడు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ని మళ్ళీ ఇక్కడే జరుపుతాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌రెడ్డిగారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పోలీస్ శాఖకి నా కృతజ్ఞతలు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. హిట్ కొడుతున్నాం అని చెప్తున్నా’ అంటూ ప్రేక్షకుల, అభిమానుల హర్షధ్వానాల మధ్య సెలవు తీసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



