"నైలునది ధారలాగ" ప్రవహించిన 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'లోని మెలోడీ సాంగ్
on Jan 28, 2021
'118' వంటి సూపర్‌హిట్ మూవీ తర్వాత సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ రూపొందిస్తోన్న చిత్రం 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు'(ఎవరు, ఎక్కడ, ఎందుకు). తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ మిస్టరీ థ్రిల్లర్ నిర్మాణమవుతోంది. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ రవిప్రసాద్ రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
గురువారం ఈ చిత్రంలోని "నైలునది ధారలాగ ప్రవహించె నేడు తొలి ప్రేమస్వరం.." అంటూ సాగే మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సైమన్ కె. కింగ్ స్వరాలు కూర్చిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు. సిద్ శ్రీరామ్, కల్యాణి నాయర్ ఆలపించారు. ట్యూన్స్ ఎంత మధురంగా ఉన్నాయో, రామజోగయ్య రాసిన పదాలు అంద అందంగా ఉన్నాయి.
"జైలుగది లాగె తోచె నిను కలవలేని నా కలల వనం, అద్దం ముందు ఉన్నదీ అందని మెరుపు.. అందంవైపు లాగుతున్నదీ తెరిచిన తలుపు, నాలుగు గోడలె అంచులుగా మరోలోకం విరిసిందీ" లాంటి లైన్లు కొంత కాలంగా సినిమాల్లో సాహిత్యానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. సిద్ శ్రీరామ్, కల్యాణి నాయర్ వాయిస్‌లలో ఆ సాహిత్యం మధురంగా పలికింది. హీరో హీరోయిన్లు అదిత్ అరుణ్, శివానీలపై చిత్రీకరించిన ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చాడు.
ప్రియదర్శి, వైవా హర్ష, సత్యం రాజేశ్, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి మిర్చి కిరణ్ సంభాషణలు రాయగా, డైరెక్టర్ కె.వి. గుహన్ స్వయంగా సినిమాటోగ్రఫీ సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రియల్ సతీశ్ స్టంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)