నాగేంద్రన్స్ హనీమూన్స్ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అప్పుడే!
on Jul 8, 2024
మలయాళం సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి భారీ హిట్ ని పొందుతున్నారు కొందరు మేకర్స్. అదే పంథాలో ఇప్పుడు మరో కొత్త మూవీ తెలుగులో రానుంది. అదే 'నాగేంద్రన్స్ హనీమూన్స్ '.
ప్రముఖ మలయాళం నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు మేకర్స్. సూరజ్ వెంజరమూడు, శ్వేత మీనన్ , గ్రేస్ ఆంటోనీ, నిరంజన అనూప్, కనికుశృతి, ఆల్ఫీ పంజికరన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. నితిన్ రెంజీ పనికర్ ఈ సిరీస్ ని నిర్మించాడు.
నాగేంద్రన్ డబ్బులు సంపాదించాలని దుబాయ్ కి వెళ్ళాలనుకుంటాడు. అదే సమయంలో తను అయిదుగురు అమ్మాయిలని పెళ్ళి చేసుకుంటాడు. అసలు నాగేంద్రన్ ఎందుకు ఆ అయుదు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి వచ్చింది? అతను విదేశాలకి వెళ్ళాలనుకున్న కలని నెరవేర్చుకున్నాడా లేదా అనేది మిగతా కథ. అయితే ఈ సిరీస్ జూలై 19 నుండి స్ట్రీమింగ్ కు రానున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read