నాగార్జున న్యూలుక్ హిట్ అవుతుందా..?
on Jan 2, 2018

వయసు 60కి దగ్గర అవుతున్నా... ఇంకా నాగార్జున ప్రేక్షకులకు మన్మథుడే. ఆ మాటకొస్తే... తన తనయులు నాగచైతన్య, అఖిల్ కంటే కూడా నాగార్జునే ఇంకా గ్లామర్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల నాగ్ ఓ స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో ఇప్పుడు చర్చనీయాంశమైంది. నాగ్ ని అందరూ మన్మథుడు అని ఎందుకంటారో.. ఆ ఫోటో చూస్తే అవగతం అవుతుంది. మనవళ్లను ఎత్తుకునే వయసులో కూడా సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న నాగ్ ని చూసి అందరూ ప్రశంసల వర్షం గురిపిస్తున్నారు. .
2017లో తనకు చోటు చేసుకున్న మరపురాని సంఘటనలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు నాగ్. అందులోనే అనేక ఫోటోలను కూడా పెట్టారు. వాటిలో నాగ్ షర్ట్ లేకుండా.. సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఫోటో ఒకటి ఉంది. ప్రస్తుతం ఆ ఫోటోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ‘అమృతం తాగాడా ఏంటి? ఏంటీ విచిత్రం..?’ అని ఆశ్చర్యపోయే రీతిలో ఈ ఫోటో ఉంది.
వర్మ సినిమాలో నాగ్ గెటప్ ఇలాగే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈనాటికీ విరివిగా సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు పోటీ పడుతున్నాడు నాగ్ ని నిజంగా అభినందించాల్సిందే. నాగ్ సిక్స్ ప్యాక్ ఫోటోను మీకందిస్తున్నాం. సరదాగా మీరు కూడా చూసేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



