దేవుడిలా వచ్చి గొప్పగా సాగనంపాడు!
on Dec 11, 2017
దర్శకుడు విక్రమ్ కుమార్ ని ‘హలో’ వేడుకలో ఏ రేంజ్ లో పొగడ్తలతో ముంచెత్తాడు నాగ్. దర్శకుల్ని పరిచయం చేయడంలోనే కాదు.. వాళ్లను మంచి చేసుకోవడంలో కూడా నాగ్ స్టైలే సపరేట్ అని మరో మారు ఈ వేడుకలో రుజువైంది. ‘హలో’ దర్శకుడు విక్రమ్ కుమార్ గురించి మాట్లాుడూతూ..
‘నాన్నతో కలిసి మా ఫ్యామిలీ అంతా నటించాలని అనుకున్నప్పుడు... ఎలాంటి కథ చేయాలో అర్థం కాలేదు. అలాంటి సమయంలో దేవుడులా వచ్చాడు విక్రమ్. అద్భుతమైన... జీవితంలో మచిరిపోలేని సినిమాను ‘మనం’ రూపంలో మాకందించి నాన్నను గొప్పగా సాగనంపాడు. విక్రమ్ కుమార్ రుణం మేం నిజంగా తీర్చుకోలేం. ‘హలో ’ సినిమా చూశాను. తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అంతులో సందేహం లేదు. ‘హలో’ సెట్స్ పై ఉన్నప్పుడే విక్రమ్ తో మాట తీసుకున్నాను. తన నెక్ట్స్ ఫిలిం నాగచైతన్యతో ఉండాలని. తాను కూడా అంగీకరించాడు. ప్రస్తుతం నాగచైతన్య కోసం కథ తయారు చేసేపనిలో ఉన్నాడు విక్రమ్. థ్యాక్స్ విక్రమ్ అని ప్రశంసల జల్లే కురిపించాడు.
వైజాగ్ లో వాన పడుతుందని వాతావరణశాఖ చెప్పినా ఆ రోజు వాన పడలేదు. కానీ, నాగ్... విక్రమ్ కుమార్ పై కురిపించిన పొగడ్తల వాన దెబ్బకు... వైజాగ్ తీరం తడిసి ముద్ద అయయింది.