ఆ హీరో షర్ట్ ఖరీదు అక్షరాల రెండు లక్షలు!
on Oct 10, 2023
సాధారణంగా ఎంత పెద్ద హీరో అయినా మహా అయితే ఒక 10000 వేల రూపాయిల ఖరీదు చేసే షర్ట్ ని దరిస్తాడు. ఇంకా మహా అయితే 15000 లేదా 20000 ఖరీదు చేసే షర్ట్ ని దరిస్తాడు. కానీ ఒక హీరో మాత్రం 2 లక్షలు ఖరీదు చేసే షర్ట్ ని ధరించి సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఈ వార్త ఒక్క రెండు తెలుగు రాష్ట్రాలల్లోనే కాకుండా యావత్తు భారతదేశం మొత్తం సంచలనం అయ్యి కూర్చుంది.
భారతీయ చిత్ర పరిశ్రమలో నటనకి సంబంధించి అన్ని పాత్రలని పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం నాగార్జున మాత్రమే. సినిమా పరిశ్రమలో ఆయన సృష్టించిన చరిత్ర అందరికి తెలిసిందే. ఇప్పుడు బుల్లి తెర మీద కూడా ఆయన రికార్డు క్రి యేట్ చేసాడు. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో ప్రారంభం నుంచే నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.బిగ్ బాస్ సీజన్ 7 కి కూడా నాగ్ యాంకరింగ్ చెప్తూ రికార్డు సృష్టించాడు. బిగ్ బాస్ ప్రారంభం నుంచి నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రపంచం మొత్తంలో చూసుకున్న ఇది ఒక రికార్డు
తాజాగా జరిగిన బిగ్ బాస్ కార్యక్రంలో నాగార్జున ఒక కలర్ ఫుల్ షర్ట్ ధరించాడు. ఆ షర్ట్ ని చూడగానే ప్రింటెడ్ కలర్ షర్ట్ అని కూడా క్లియర్ గా అర్ధం అవుతుంది. అందరు షర్ట్ బలే బాగుంది అని అనుకున్నారు. కొంత మంది ఇంకో అడుగు ముందు కేసి గూగుల్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు తెలుసుందామని చెక్ చేసారు. ఇక అంతే సంగతులు నాగార్జున వేసుకున్న షర్ట్ ఖరీదు చూసి ఒక్క సారిగా షాక్. ఎందుకంటే ఆ షర్ట్ ఖరీదు అక్షరాలా రెండు లక్షల రూపాయిలు..
ఆ తర్వాత ఆ షర్ట్ అంత రేటు ఎందుకని ఆరా తీసిన వాళ్ళకి ఆ షర్ట్ ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ అయిన వ్యూయస్ లుటన్ కి చెందినదని అందుకే అంత ఖరీదు అని అర్ధం అయ్యింది. రెండు లక్షల రూపాయిల షర్ట్ తమ అభిమాన హీరో వేసుకున్నందుకు నాగార్జున అభిమానులు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కూడా ఎంతైనా నాగార్జున కింగ్ కదా అని అనుకుంటున్నారు. నాగార్జున బిగ్ బాస్ ప్రోగ్రాం లో బిజీ గా ఉంటూనే ఇంకో పక్క తన స్టైల్ మార్క్ సినిమా అయిన నా సామి రంగ సినిమా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
