నాగార్జున మీద మండిపడిన రచయిత
on May 31, 2018
.jpg)
రామ్‌గోపాల్ వర్మ మీద యువ రచయిత జయకుమార్ తీవ్రంగా విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే! తన కథలని వర్మ కాపీ కొట్టి మోసం చేశాడని జయకుమార్ ఆరోపిస్తున్నారు. ఆఫీసర్ కథ కూడా తనదేననీ, దాన్ని వర్మ చోరీ చేశాడని మొత్తుకుంటున్నాడు. ఈ విషయంలో నాగార్జున కూడా జోక్యం చేసుకోవాలని జయకుమార్ అభ్యర్థించాడు. ఈ విషయం మీద నాగార్జున నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఈసారి నాగార్జున మీద విరుచుకుపడ్డాడు జయకుమార్. (ఇంత జరిగిన తర్వాత కూడా) నాగార్జున ఈ సినిమాకు ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదన్నాడు. వర్మ మాస్టర్ మైండ్ కాదనీ కాపీ మాస్టర్ అనీ ఎద్దేవా చేశాడు. దీనికి వర్మ స్పందనేమిటో చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



