ENGLISH | TELUGU  

కొత్తదనం+ విభిన్నం=నాగార్జున

on Aug 29, 2016


నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు నాగార్జున. యువ సామ్రాట్‌గా, మన్మధుడిగా, కింగ్‌గా తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాడు. ఏఎన్నార్ ప్రభావమో లేక అమెరికాలో చదివుల వల్లనో ఆయన తొలి నుంచి కొత్తదనానికి పెద్ద పీట వేస్తూ వచ్చారు. తొలి సినిమా నుంచే నలుగురికి భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు నాగ్. అందుకే ఆయన చేసిన ఒక సినిమాకు మరో సినిమాకు అస్సలు పోలిక ఉండదు. హీరోయిన్లతో రోమాన్స్ చేసి..అంతలోనే అదిగో అల్లదిగో అంటూ అన్నమయ్యగా భక్తుల చేత దండాలు పెట్టించగలరు. ప్రేక్షకుల నాడీని పసిగట్టడంలో నాగార్జునను కొట్టేవారు లేరు. అందుకే 50 ప్లస్‌లోనూ తన ఇద్దరు కొడుకులతో పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. కొత్తదనానికి..కొత్త దర్శకులకు ఎప్పుడూ ప్రోత్సహాన్నిచ్చే కింగ్ నాగార్జున పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ అందిస్తూ నాగ్ ప్రయోగాత్మకంగా చేసిన సినిమాలు కొన్ని మీకోసం..

 

శివ: నాగార్జున కెరిర్‌నే కాదు..ఏకంగా తెలుగు చిత్ర సీమ గతినే మార్చిన సినిమాగా నిలిచిపోయిన సినిమా శివ. విజయవాడ రౌడీయిజాన్ని ఎదిరించే ఒక కుర్రాడి కథతో రూపొందించిన శివ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పటికి కొత్త దర్శకుడిగా ఉన్న రామ్‌గోపాల్ వర్మ మీద నమ్మకంతో నాగార్జున ఆయనకు ఛాన్సిచ్చారు. దానిని వమ్ము చేయని వర్మ సినిమాను అద్భుతంగా మలిచాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బాగా పాపులర్ అయిన సైకిల్ చైన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు.

 

మజ్ను: విక్రమ్ తర్వాత నాగ్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో హీరోగా నిలదొక్కుకోవాల్సిన పరిస్థితిలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మజ్ను నాగార్జునను నిలబెట్టింది. తెలుగు సినిమాలో విషాద కధలకు, భగ్న ప్రేమగాథలకు కేరాఫ్ అడ్రస్ ఏఎన్నార్. దీంతో అక్కినేనికి ఉన్న రోమాంటిక్ హీరో ఇమేజ్‌ను, లవర్ బాయ్ ఇమేజ్‌ను మేళవించి మజ్నును రూపొందించారు దాసరి. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా అద్భుతంగా నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు నాగ్.

 

గీతాంజలి: ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా గీతాంజలి. అద్భుతమైన ప్రేమకావ్యంగా ఇప్పటికీ సినీ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. రోటీన్ సినిమాలకు భిన్నంగా, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పాటలతో గీతాంజలి నాగ్ కెరిర్‌లో ఒక మంచి సినిమాగా నిలిచిపోయింది.

 

అన్నమయ్య: రోమాంటిక్ హీరోగా దూసుకుపోతున్న సమయంలో నాగ్ చేసిన ప్రయోగం అన్నమయ్య. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్వరస్వామి పరమ భక్తుడు అన్నమాచార్య జీవిత కథతో నేపథ్యంలో సాగే సినిమాలో నాగ్ అన్నమయ్య పాత్రలో నటించారు. అన్నమయ్య పాత్రలో నాగ్ నటించలేరంటూ హేళన చేసిన వారి చేత నాగ్ తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్ర చేయ్యలేరనిపించేంతగా నాగార్జున అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(జ్యూరీ)ని అందుకున్నారు నాగ్.

 

మన్మధుడు: నాగార్జునలోని హాస్య రసాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా మన్మథుడు. విజయభాస్కర్ దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్‌తో నాగ్ చేలరేగిపోయాడు. ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించి నాగార్జునకు మన్మథుడు అన్న ట్యాగ్‌లైన్ తగిలించిన సినిమాగా ఇది నిలిచిపోయింది.

 

గగనం: చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమా చేసిన ప్రయోగం గగనం. తెలుగు సినిమా అంటే పాటలకు, కామెడీకి పెద్ద పీట...అలాంటిది సినిమాలో ఏమాత్రం కామెడీ గానీ పాటలు గానీ లేకపోతే. ఇలాంటి ప్రయోగం చేయ్యాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. కానీ అక్కడుంది నాగ్. తమిళ దర్శకుడు కథ చెప్పడం ఆలస్యం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఒక ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో సస్పెన్స్‌తో నడిచే ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 

మనం: తెలుగు సినీ చరిత్రలో అక్కినేని ఫ్యామిలీది ప్రత్యేక స్థానం. నటసామ్రాట్ ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకు మూడు తరాలు సినీ కళామతల్లి సేవలో తరించిన కుటుంబం వారిది. ఆ కుటుంబం మొత్తం తెరపై సందడి చేస్తే అన్న దానిని దర్శకుడు విక్రమ్ కుమార్ నిజం చేసి చూపించాడు. అక్కినేని వంశంలోని మూడు తరాలు(ఏఎన్నార్, నాగార్జున, ఆమల, నాగచైతన్య, అఖిల్) నటించిన "మనం" సినిమా తెలుగు తెరలో కొత్త ప్రయోగానికి నాంది పలికి ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించింది. మహానటుడు ఏఎన్నార్ 90 ఏళ్ల వయసులోనూ చలాకీగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఈ సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. ఈ సినిమా స్పూర్తితో మరెన్నో సినీ కుటుంబాలను మనం లాంటి సినిమాలు తీయడానికి ప్రణాళికలు రెడీ చేస్తున్నాయి.

 

ఊపిరి: నాగ్ ప్రయోగాల్లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోయే సినిమా ఊపిరి. సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న ఏ స్టార్ హీరో చేయని సాహసం నాగ్ చేశాడు. ఫ్రెంచ్ మూవీ ద ఇన్‌టచ్‌బుల్స్ సినిమా రీమేక్‌గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నాగార్జున మరోసారి బెస్ట్ అని ప్రూవ్ చేసింది. సినిమా మొత్తం వీల్‌చైర్‌లో కూర్చొనే పాత్రలో ఎలాంటి బాడీలాంగ్వేజ్ లేకపోయినా కేవలం హావభావాలతోనే ఎమోషన్స్ పండించి..కంటతడి పెట్టించాడు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.