నాగచైతన్యతో సమంత ప్రేమ సక్సెస్.. అట్టహాసంగా నిశ్చితార్థం..!
on Jun 28, 2016

గత కొంతకాలంగా టాలీవుడ్ లో హల్ చేస్తోన్న "నాగచైతన్య-సమంత"ల పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఇద్దరు "మనం" సినిమా టైమ్ నుంచే ప్రేమలో ఉన్నారట. అప్పూడే సిద్దార్థ్ తో బ్రేకప్ అవ్వడంతో నాగచైతన్య విషయాన్ని బయటపెట్టనివ్వలేదు సమంత. "బ్రహ్మోత్సవం" సినిమా విడుదల సమయంలో "నాకో బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు" అని సమంత స్టేట్ మెంట్ ఇచ్చినప్పప్పుడే అందరూ "ఇంకెవరూ నాగచైతన్య అయ్యుంటాడు" అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఆ తరువాత వారి నమ్మకమే నిజం అయ్యిందనుకోండి. సమంత కూడా దాదాపుగా కన్ఫర్మ్ చేసేశాక.. నాగార్జునకు ఇష్టం లేదని కొందరు, నాగాచైతన్య అప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేడని ఇంకొందరు చెప్పుకొన్నారు. అయితే.. ఎట్టకేలకు సదరు గాలి వార్తలకు తెరపడింది. "నాగచైతన్య-సమంత"లు త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. వచ్చే నెలలో ఈ ఇద్దరి నిశ్చితార్ధం అట్టహాసంగా సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ప్రస్తుతం "ప్రేమమ్"లోని ఓ రెండు పాటల చిత్రీకరణ కోసం నార్వే పయనమవుతున్నాడు నాగచైతన్య.. అక్కడ్నుంచి రాగానే సమంతతో ఎంగేజ్ మెంట్ ను ఏర్పాటు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. మొత్తానికి.. నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారం సూపర్ సక్సెస్ అయ్యి.. పెళ్లి వరకూ రావడంతో ఆ ఇద్దరి సన్నిహితులతోపాటు సినిమా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



