ముఖానికి రంగేసుకోనున్న సమంత..!
on Oct 24, 2016
.jpg)
నాగచైతన్యతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి...ఆ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లిపీటల దాకా చేర్చింది సమంత. పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇండస్ట్రీలోనూ..అభిమానుల్లోనూ ఒకటే డౌట్..పెళ్లయితే సమంత సినిమాల్లో కంటిన్యూ అవుతుందా..? లేక ఇంటికే పరిమితమవుతుందా అని అయితే ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిన సమంతను సినిమాలు చేయకుండా, ఇంట్లో కూర్చోమని చెప్పడం తన వల్ల కాదని చైతన్య స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ మాట మీద భరోసాతో సమ్ తిరిగి ముఖానికి రంగేసుకోవడానికి రెడీ అయ్యింది. తమిళంలో విశాల్ సినిమాతో పాటు మరో సినిమాకు సైన్ చేసింది. దీనిలో భాగంగా విశాల్ సినిమా షూటింగ్ ఇవాళ్టీ నుంచి సెట్స్‌పైకి వెళ్లడంతో..తాజా షెడ్యూల్‌లో సమంత పాల్గొననున్నది. ఇక ఇవన్ని చకచకా పూర్తి చేసి, పెళ్లి చేసుకొని అప్పుడు సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని సమంత ఆలోచన.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



