క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టిన నాగ చైతన్య!
on Jan 12, 2022

తన తండ్రి కింగ్ నాగార్జునతో కలిసి అక్కినేని యువ హీరో నాగ చైతన్య చేసిన సినిమా 'బంగార్రాజు'. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పాడు.
చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 80 శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని చెప్పిన చైతన్య.. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలిపాడు. అలాగే, విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఒక హారర్ వెబ్ సిరీస్ చేస్తున్నానని గుర్తు చేశాడు. హారర్ మూవీస్ చూడటానికి భయపడే తాను, కొత్తదనం కోసం హారర్ సిరీస్ లో నటిస్తున్నానని చెప్పాడు. అయితే ఈ సిరీస్ పూర్తయ్యాక ఆడియో లేకుండా మ్యూట్ లో(సరదాగా) చూస్తానేమోనని చైతన్య అన్నాడు.
మహేష్ బాబు 'సర్కారు వారి పాట' తర్వాత దర్శకుడు పరశురామ్ తో తన సినిమా ఉంటుందని చైతన్య తెలిపాడు. అలాగే 'నాంది' డైరెక్టర్ విజయ్ కనకమేడలతో ట్రావెల్ అవుతున్నానని, అయితే ఇంకా స్టోరీ ఫైనల్ కాలేదని చైతన్య చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



