నాగచైతన్య కొత్త చిత్రం పరిస్థితి ఇదే..మరి అక్కినేని ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి!
on Apr 16, 2025
'తండేల్'(Thandel)తో హిట్ ట్రాక్ లో వచ్చిన 'నాగ చైతన్య'(Naga Chaitanya)ఆ మూవీ ద్వారా తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల మార్కుని అందుకున్నాడు. దీంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చినట్లయ్యింది. అక్కినేని నాగార్జున(Nagarjuna)సైతం తండేల్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతు సక్సెస్ మీట్ కి వచ్చి ఎన్నాళ్ళయ్యిందని చిన్నపాటి భావోద్వేగానికి కూడా గురయ్యాడు. దీంతో 'తండేల్' విజయం అక్కినేని అభిమానులకి ఎంత విలువైందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నాగ చైతన్య 'తండేల్' విజయం ఇచ్చిన ఉత్సాహంతో విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు.
ఆధ్యాత్మిక,హర్రర్ అంశాల నేపథ్యంలో మిథికల్ థ్రిలర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా హైదరాబాద్ లోప్రారంభమయ్యింది. ఇప్పటికే కొంత భాగాన్ని కంప్లీట్ చేసుకోగా, ప్రస్తుత షెడ్యూల్ లో ప్రత్యేకంగా వేసిన ఒక భారీ సెట్ లో షూటింగ్ జరుపుకోనుంది. దాదాపుగా 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య తో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొనబోతుంది. కథలో వచ్చే పలు కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
నాగ చైతన్య కెరీర్ లో 24 వ చిత్రంగా తెరెక్కుతున్న ఈ మూవీని 'సుకుమార్'(Sukumar)రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీచిత్రపై బివిఎస్ఎన్ ప్రసాద్(Bvsn Prasad)నిర్మిస్తున్నాడు. కాంతార ఫేమ్ 'అజనీష్ లోక్ నాధ్' సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
