చైతుకి ఎల్ సియూ లో అవకాశం వస్తుందా!
on Jan 31, 2025
యువసామ్రాట్ 'నాగ చైతన్య'(Naga Chaitanya)ఫిబ్రవరి 7 న 'తండేల్'(Thandel)తో ప్రేక్షకుల మందుకు రానున్న విషయం తెలిసిందే.'కార్తికేయ 2 ' ఫేమ్ 'చందు మొండేటి'(Chandu Mondeti)దర్శకత్వంలో 'సాయి పల్లవి'(Sai Pallavi)హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్నిగీత ఆర్ట్స్ పతాకంపై అగ్ర నిర్మాత 'అల్లు అరవింద్'(Allu Aravind) నిర్మిస్తున్నాడు.దీంతో అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా 'తండేల్' పై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.చైతు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుందనే నమ్మకాన్ని కూడా అక్కినేని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.ట్రైలర్ తో పాటు 'దేవిశ్రీ ప్రసాద్' అందించిన సాంగ్స్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి.ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుండగా, ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో జరుగుతున్నాయి.
రీసెంట్ గా తమిళ రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్స్ చెన్నై వేదికగా జరిగాయి.ఈ ఈవెంట్ కి చైతు,సాయి పల్లవి,అల్లు అరవింద్, దేవిశ్రీప్రసాద్(Devi Sriprasad)తో పాటు చిత్ర యూనిట్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చైతు మాట్లాడుతు నాకు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ LCU ఎంతో నచ్చింది.అందులో భాగం కావాలని కోరుకుంటున్నాని తెలిపాడు.
ప్రముఖ తమిళ దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)విక్రమ్,లియో లాంటి భారీ విజయాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ని సృష్టించాడు.ఇందులో భాగం కావాలని ఎంతో మంది హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.చైతు నాన్న నాగార్జున లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలి'(Coolie)మూవీలో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చైతు కూడా LCU లో భాగం కావాలనిచెన్నై వేదికగా వెల్లడి చెయ్యడం సినీ సర్కిల్స్ లో ఆసక్తిని కలుగచేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
