పాపం.. పవన్ వల్ల కూడా కాలేదు
on May 15, 2018

'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' తొలి రోజే డివైడ్ టాక్ మూటగట్టుకుంది. కనీసం యావరేజ్‌గా అయినా సరే, నిలబెట్టాలని థ్యాంక్స్ మీట్ పెట్టి పవన్ కల్యాణ్‌ని పిలిపించారు. ఆ థ్యాంక్స్ మీట్ కాస్త చప్పగా సాగింది. పవన్ రాకతో.. వసూళ్లలో కాస్తయినా జోష్ వస్తుందనుకున్నారు. కానీ... పవన్ వల్ల ఈ సినిమాకి ఒరిగిందేమీ లేదు. 'మహానటి' రాకతో... ఆ వసూళ్లు కూడా డల్ అయిపోయాయి. అల్లు అర్జున్ పట్టుబట్టి.. పవన్ కల్యాణ్‌ని ఈ కార్యక్రమానికి పిలిపించాడని, అయితే.. పవన్ రాక వల్ల 'సూర్య' బెనిఫిట్ పొందలేకపోయాడని వార్తలొచ్చాయి. నిజానికి ఈ కార్యక్రమానికి పవన్‌ని ఎవరూ పిలవలేదట. పవన్ స్వయంగా బన్నీకి ఫోన్ చేసి `నా పేరు సూర్య` వివరాలు అడిగితెలుసుకుని, ఏదైనా ఫంక్షన్ ఏర్పాటు చేయ్.. నేనొస్తా- అన్నాడట. పవన్ స్వయంగా ఫోన్ చేసి వస్తాననడంతో... థ్యాంక్స్ మీట్ పెట్టాలన్న ఉద్దేశం లేకపోయినా.. కేవలం పవన్ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించార్ట. అందుకే బన్నీతో సహా అందరూ ముక్తసరి మాటలతో ముగించాల్సివచ్చిందని తెలుస్తోంది. బన్నీకి ఈ ఫంక్షన్ నిర్వహించడం ఏమాత్రం ఇష్టం లేదని, నిర్మాత బలవంతంపై, మరోవైపు పనవ్ వస్తానని చెప్పడం వల్ల థ్యాంక్స్ మీట్ కి 'ఓకే' అన్నాడని తెలుస్తోంది. పవన్ సాధారణంగా ఇలాంటి వేడుకలకు హాజరవ్వడు. పిలిచినా.. వెళ్లడు. అలాంటిది... తనకు తానై... వస్తానని చెప్పడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. వర్మ విషయంలో పవన్ సీరియెస్ అయి, ఛాంబర్ మెట్లెక్కినప్పుడు.. తాను పిలవకుండానే అల్లు అర్జున్ వచ్చాడు. అందుకే పవన్... ఇలా తనకు తానుగా థ్యాంక్స్ మీట్‌కి వచ్చి ఉంటాడు. అయినా ప్రయోజనం ఏముంది? ఆరోజున పవన్ కల్యాణ్ ఛాంబర్ లో చేసిన హల్ చల్ ఫెయిల్ అయినట్టు.. ఇప్పుడు 'నాపేరు సూర్య' థ్యాంక్స్ మీట్ కూడా ఫెయిల్ అయిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



