ఆ ఛానల్స్ చేసిన పనికి ఇరకాటంలో బన్నీ
on May 1, 2018
.jpg)
గత కొన్ని రోజులుగా మెగా కుటుంబం దగ్గరవుతున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పడం... రంగస్థలం చూడడం... ఆ తర్వాత సినిమా సక్సెస్ మీట్ కి అటెండ్ అవ్వడం మెగాభిమానులకు సంతోషంలో ముంచెత్తింది. ఇక న్యూస్ చానెల్స్ తనపై వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నాయని ప్రకటించినప్పుడు, మెగా ఫామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి బాసటగా నిలిచింది. పవన్ కళ్యాణ్ నికి అల్లు అర్జున్ కూడా రావడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో బన్నీ కి పవన్ కి మధ్య చెడిందని వార్తలు వచ్చాయి. బన్నీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులపై పలు సార్లు తీవ్రమయిన విమర్శలు చేసాడు. ఇదిలా ఉంటే, మొన్న జరిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా విచ్చేసిన రామ్ చరణ్ బన్నీ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే, ఈ ఫంక్షన్ ని పవన్ కళ్యాణ్ బ్యాన్ చేయాలని ప్రపోజ్ చేస్తున్న చానళ్ళు కూడా ప్రసారం చేయడం ఒకింత వివాదాస్పద మయింది. అల్లు ఫామిలీ పవన్ ని లెక్కచేయడం లేదని గుసగుసలు వినిపించాయి. ఈ తరుణంలో వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, అసలు నా పేరు సూర్య నిర్మాతలు ఆ చానళ్లకు ప్రసార హక్కులు ఇవ్వకున్నా ఫీడ్ ఎలాగో సంపాదించి తమ ఛానల్లో ప్రసారం చేసుకున్నారట. ఇది ఒక విధంగా, మెగాభిమానుల్లో చీలిక తీసుకురావడానికి చేసిన ప్రయత్నంలో భాగం అని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమయినా, ఈ విషయంతో ఖంగుతిన్న అల్లు అర్జున్, అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ కి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. లేదంటే, నా పేరు సూర్య సినిమాకి ఇబ్బంది అవుతుంది కదా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



