ఈ ఫొటోలో ఉన్న బుడతడు ఇవాళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. గుర్తుపట్టారా?
on Jun 5, 2021
అక్కినేని నాగేశ్వరరావును 'సీతారామ జననం' సినిమా ద్వారా హీరోగా పరిచయం చేసి, ఆయన కెరీర్‌కు దీపధారిగా నిలిచిన నిర్మాత-దర్శకుడు ఘంటసాల బలరామయ్య మనవడు ఇవాళ టాలీవుడ్ మ్యూజిక్‌ను ఏలేస్తున్నాడు. అవును. అతనే తమన్. అతని తండ్రి ఘంటసాల శివకుమార్ ఒక డ్రమ్మర్. నిన్నటి తరం అగ్ర సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర దాదాపు 700 సినిమాలకు శివకుమార్ డ్రమ్మర్‌గా పనిచేశారు. తమన్ తల్లి సావిత్రి కూడా సంగీత కుటుంబం నుంచి వచ్చిన ఆమే. నేపథ్య గాయనిగా ఆమె పనిచేశారు. ఆ సంగీతం చిన్నతనం నుంచే తమన్ నరనరానా ప్రవహిస్తూ వచ్చింది.
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తన చిన్ననాటి ఫొటోను తమన్ షేర్ చేశాడు. అందులో తండ్రి డ్రమ్స్‌ను వాయిస్తూ కనిపిస్తున్నాడు. బహుశా అప్పుడతనికి రెండు మూడేళ్లుంటాయేమో. ఆ ఫొటో ఎంత ముచ్చటగా ఉందో, చిన్నారి తమన్ కూడా అంత ముద్దొస్తున్నాడు. ఆ ఫొటోను షేర్ చేసి, "My childhood friend my drums. I can’t call it my favourite TOY TOOO" అని రాసుకొచ్చాడు తమన్.
గమనించదగ్గ విశేషం ఏమంటే తండ్రి ఎలాగైతే ఒక సింగర్‌ను వివాహం చేసుకున్నారో, తమన్ కూడా అలాగే ఒక సింగర్‌ను పెళ్లాడాడు. ఆమె శ్రీవర్ధిని.
పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. "మగువా మగువా" సాంగ్ సూపర్ పాపులర్ కాగా, ఆ సినిమాకు తమన్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందరి ప్రశంసలూ పొందింది. సినిమాలోని ప్రధాన హైలైట్స్‌లో ఒకటిగా నేపథ్య సంగీతం నిలిచింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
