ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
on May 21, 2023

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(తోటకూర సోమరాజు) కన్నుమూశారు. 68 ఏళ్ళ రాజ్, హైదరాబాద్ లోని తన నివాసంలో ఈరోజు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
టాలీవుడ్ లో రాజ్-కోటి సంగీత ద్వయానికి ఎంతటి పేరుందో తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.'ప్రళయ గర్జన' వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. దాదాపు 180 సినిమాలకు కలిసి పని చేశారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, బాలగోపాలుడు, బావ బావమరిది, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరు సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత ఈ ద్వయం విడిపోయారు. రాజ్ సోలోగా 'సిసింద్రీ', 'రాముడొచ్చాడు' వంటి సినిమాలకు సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



