'మూడో కన్ను' మూవీ రివ్యూ
on Jan 29, 2024
నటీనటులు: సాయికుమార్, శ్రీనివాస్ రెడ్డి , నిరోష , మాధవిలత , కౌశిక్ రెడ్డి , దేవి ప్రసాద్, వీర శంకర్, దయానంద రెడ్డి, ప్రదీప్ రుద్ర, కాశీ విశ్వనాథ్,
చిత్రం శ్రీను, తిరుపతి మాధవ, సత్య శ్రీ తదితరులు
కెమెరా: ముజీర్ మాలిక్ , వెంకట్ మన్నం, అక్షయ్
ఫైట్స్: శంకర్ ఉయ్యాలా
మ్యూజిక్: స్వర
ఎడిటర్: మహేష్ మేకల
స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే: కె.వి రాజమహి
దర్శకులు: సురత్ రాంబాబు, మావిటి సాయి సురేంద్ర బాబు, డాక్టర్ కృష్ణ మోహన్కే, బ్రహ్మయ్య ఆచార్య
నిర్మాతలు: కే వి రాజమహి , సునీత రాజేందర్ దేవులపల్లి
విడుదల తేదీ : జనవరి 26, 2024
అమెరికాలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన యాంథాలజీ మూవీ 'మూడో కన్ను'. ఇందులో నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథని ఒక్కో దర్శకుడు తెరకెక్కించడం జరిగింది. మరి యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ యాంథాలజీ మూవీ ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఒక అందమయిన ఫ్యామిలీలో ఒక రోజు పెంపుడు కుక్క చనిపోతుంది. ఫ్యామిలీ ఆ షాక్ లో ఉండగా హీరో మదర్ చనిపోతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది? ఆ హత్యలు ఎవరు చేశారు? వంటి అంశాల చుట్టూ మొదటి కథ తిరుగుతుంది. ప్రపంచంలో ఇప్పుడిప్పుడే టెక్నాలజీ మారుతున్న తరుణంలో మనిషి తయారు చేసిన కృతిమ మాంసం కోసం జరిగిన పోరాటం నేపథ్యంలో రెండవ కథ ఉంటుంది. అసలు ఆ ఫార్ములా ఎవరిది? ఎందుకు తయారు చేశారు? దీని వల్ల ఎవరికి నష్టం? ఆ ఫార్ములాని ఎవరు దొంగలించారు? వంటివి రెండవ కథలో చూస్తాం. ఒక నేరంలో ఒక నేరస్తుణ్ణి పట్టుకునే స్కెచ్ లో జరిగిన ఒప్పదం పిల్లవాడితో చేయిస్తారు. అది ఎవరు చేయించారు? ఎవరికోసం చేయించారు? అనేది మూడవ కథలో ఉంటుంది. ఇక ముందు మూడు కథలను లింక్ చేస్తూ నాలుగో కథ సాగుతుంది.
విశ్లేషణ:
ఒక రచయిత రాసిన కథని నలుగురు దర్శకులు తెరకెక్కించడం అంత తేలికైన విషయం కాదు. ఆ విషయంలో మూడు కన్ను టీం బాగానే సక్సెస్ అయింది. ఈ యాంథాలజీకి కథ, మాటలు ప్రధాన బలంగా నిలిచాయి. ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. సాయికుమార్, శ్రీనివాస రెడ్జ్ వాళ్ల నరేషన్ తో అదరగొడతాడు అని అందరికీ తెలుసు. సరిగ్గా ఇదే ఫార్మాట్ లో 'మూడో కన్ను' చిత్రం కథనం కూడా నడుస్తుంది.
దర్శకులు రొటీన్ కథాంశాన్ని ఎంచుకోకుండా యదార్థ సంఘంటన అధారంగా రాసుకున్న మంచి స్క్రిప్ట్ ని ఎంచుకొని, దానిని తమదైన శైలిలో తెరకెక్కించి మెప్పించారు. సస్పెన్స్ ని, ఎమోషన్ ని సమపాళ్ళలో క్యారీ చేస్తూ అలరించారు. అయితే మామూలుగా నలుగురు దర్శకులతో సినిమా అంటే అన్ని రకాలుగా ఒక ట్రీట్ లా ఉంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం కాస్త తడబాటు కనిపిస్తూ ఉంటుంది.
ఇక ఈ సినిమాలో విజువల్స్ బావున్నాయి. లొకేషన్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ వర్క్ ఇంకా బెటర్ గా చేయాల్సింది. ఎడిటింగ్ కూడా బాగానే ఉన్నప్పటికీ.. ఎడిటర్ కత్తెరకి మరింత పని చెప్పి ఉండాల్సింది. అక్కడక్కడా స్లో నరేషన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఇంకా కాస్త బాగా కథని ప్రెసెంట్ చేస్తే బాగుందేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ 'మూడోకన్ను' చిత్రంలో ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే ఎలిమెంట్స్ తో పాటు, ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సాయికుమార్ ప్రధాన పాత్రలో నలుగురు దర్శకులు రూపొందించిన ఈ ప్రయత్నం మెప్పిస్తుంది. థ్రిల్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కోరుకునేవారు..ఈ చిత్రాన్ని తప్పకుండా చూడవచ్చు.
రేటింగ్ : 2.5/5
Also Read