నీకు గుడి కట్టడం ఖాయమేమో!
on Jan 29, 2026

మృణాల్ కి గుడి కట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది
ఈ మాటలని తీసుకొస్తుంది ఎవరు
గత రికార్డు ఏంటి!
అభిమానం అనేది కనిపించని దేవుడు కంటే గొప్పది. ఈ విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే సినీ తారల అభిమాన సంఘాలని సంప్రదించి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు.పైగా వాళ్ళు అభిమానం దేవుడు కంటే గొప్పదనే అభిమాన గర్వంతో అంతకు మించి హైప్ ని తీసుకొచ్చే పదం ఉండదని తెలిసినా సదరు వర్డ్ కోసం గూగుల్ తల్లిని సంప్రదిస్తారు. అభిమానం అనేది అంత గొప్పది..తారలకి గుడి కట్టిన ట్రాక్ రికార్డు కూడా వాళ్ళకి ఉంది. మరి ఇప్పుడు ఆ ట్రాక్ రికార్డులో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur)చేరడం ఖాయమనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరి సదరు న్యూస్ కి అంత కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం.
కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు ఉల్లాసాన్ని, భావోద్వేగాన్ని ప్రేక్షకుల మనసులో చాలా బలంగా చొచ్చుకొని తీసుకెళ్లడం మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ కి ఉన్న స్పెషల్. సరైన క్యారక్టర్ పడి,కథ, కథనాలు పర్ఫెక్ట్ గా కుదిరితే మృణాల్ ప్రభావం నుంచి తేరుకోవడం చాలా కష్టం. దాంతో ప్రేక్షకులు, సినీ ప్రియులు మృణాల్ అభిమానులుగా మారి, క్రమం, క్రమంగా డై హార్ట్ ఫ్యాన్స్ కేటగిరిలోకి చేరుకుంటారు. సీతారామం, హాయ్ నాన్న వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
శింబు(Simbu)తన కొత్త చిత్రాన్ని డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu)దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో శింబు కి జోడిగా మృణాల్ ఠాకూర్ చెయ్యబోతునట్టుగా కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్పై. గా ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. రొమాంటిక్ యాక్షన్ డ్రామా అంటే హీరో, హీరోయిన్స్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుందో తెలిసిందే.
Also read: తల్లిపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. నిండు నూరేళ్లు బాగుండాలని ఫ్యాన్స్ రిప్లై
మరి ఈ లెక్కన మృణాల్ తన మాయాజాలంతో తమిళ తంబిల హృదయాల్లో గిలిగింతలు రేపడం ఖాయం. మూవీ హిట్ అయితే మరిన్నిసినిమాల ద్వారా మృణాల్ గిలిగింతలు తమిళ తంబీలకి శాశ్వత చిరునామాగా మారడం కూడా ఖాయం.దీంతో రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో తమిళ తంబీ మృణాల్ కి గుడి కడతారనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే తమిళ తంబీ అభిమానం అలాంటిది. గుళ్ళు కట్టారా అనే విషయంలో డౌట్స్ ఉన్నా గూగుల్ తల్లిని అడిగితే మొహమాటం లేకుండా చెప్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



