
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ కి ఉన్న సినీ చరిష్మాకి కోహినూర్ డైమండ్ కి ఉన్నంత వాల్యూ ఉంది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం, 360కి పైగా సినిమాలు, 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే మోహన్‌లాల్ నే వరించాయి. అటువంటి మోహన్ లాల్ కి ఊహించని చేదు అనుభవం ఎదురైంది.
ఈ రోజు సాయంత్రం 5 గంటలకి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో కాయల్ ఈవెంట్స్ నిర్వహణలో "వైకిట్టు ఎంధ పరిపాడి" అనే భారీ కళాత్మక వేడుకని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం మోహన్‌లాల్‌తో పాటు లెజండ్రీ గాయని కేఎస్ చిత్ర, గాయకుడు, నటుడు మనోజ్ కే జయన్, అజు వర్గీస్, స్టీఫెన్ దేవస్సీ వంటి పలువురు ప్రముఖ కళాకారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే దాదాపు నెల రోజుల క్రితమే ఇతర కళాకారులు, సాంకేతిక సిబ్బంది అందరికీ ఆస్ట్రేలియా వీసాలు మంజూరు కావడంతో వారంతా సిడ్నీ చేరుకున్నారు. కానీ, ప్రధాన ఆకర్షణ అయిన మోహన్‌లాల్ వీసా దరఖాస్తు మంజూరు కాకపోవడంతో ఆయన సింగపూర్‌లోనే నిలిచిపోవాల్సి వచ్చింది. వీసా క్లియరెన్స్ సకాలంలో వస్తుందనే ఆశతో మోహన్‌లాల్ గత 2 రోజులుగా సింగపూర్‌లోనే వేచి చూశారు. అధికారులతో మాట్లాడి సాంకేతిక అడ్డంకులను పరిష్కరించడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, శనివారం నాటికి అనుమతి లభించలేదు. వీసా అప్లికేషన్ తిరస్కరణకు గురికాలేదని, పరిశీలనా ప్రక్రియలో అనుకోకుండా అనూహ్య జాప్యం జరిగిందని నిర్వాహక సంస్థ కాయల్ ఈవెంట్స్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, మోహన్‌లాల్ లేకుండా ప్రదర్శనను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో విధిలేక ఈవెంట్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆస్ట్రేలియాలోనే ఉండి వేచి చూస్తున్న అభిమానులకు, టికెట్లు కొనుగోలు చేసిన వేలాది మంది ప్రేక్షకులకు నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు.
Also read: పరేష్ రావల్ భార్య ఎవరో తెలుసా? మిస్ ఇండియా నుంచి అక్కడి దాకా
ఈ అనూహ్య పరిణామంపై సింగపూర్ నుంచి స్పందించిన మోహన్‌లాల్ అభిమానులని ఉద్దేశించి మాట్లాడారు. తన 50 ఏళ్ల నట జీవితంలో ఎన్నో ప్రదర్సనలు ఇచ్చాను. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఐర్లాండ్ వంటి అనేక దేశాల్లో అయితే ఈ ఏడాదే ప్రదర్శనలు ఇచ్చాను. వీసా ప్రక్రియలో ఏదైనా సాంకేతిక లోపం, క్లరికల్ పొరపాటు లేదా ఏఐ వ్యవస్థ వల్ల అడ్డంకి ఏర్పడి ఉండవచ్చని, లోపం ఎక్కడ ఉన్నా ఆ నిందనంతా తనపైనే వేసుకుంటున్నాను. నిర్వాహకులు, తోటి కళాకారులు షో విజయం కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులకు సారీ. త్వరలోనే ఈ షోకు సంబంధించి నూతన తేదీలను, టికెట్ల మార్గదర్శకాలను వెల్లడిస్తామని, ఇది కేవలం వాయిదా మాత్రమేనని భావోద్వేగానికి లోనయ్యారు.
Mohanlal, KS Chithra, Sydney, Mollywood






