మోహన్ బాబు రియల్ ఫైటింగ్ చేశారట..!
on Jun 4, 2016

జూన్ 4,1991. మోహన్ బాబు కెరీర్లో ఒక మైలురాయి అసెంబ్లీ రౌడీ రిలీజై సంచలనం సృష్టించిన రోజు అది. ఈ సినిమాకు నేటితో పాతికేళ్లు పూర్తైనా, మోహన్ బాబుకు మాత్రం నిన్న మొన్న జరిగినట్టే ఉంది. ఇలాంటి సినిమా తనకు దక్కడం అదృష్టమని చెప్పే మోహన్ బాబు సినిమాకు సంబంధించిన ఒక జ్ఞాపకాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. తిరుచానూరులో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మూవీ గురించి తెలుసుకున్న అప్పటి అధికార పార్టీ కార్యకర్తలు కొంతమంది అడ్డుతగిలారట. నువ్వు చెప్పే ప్రతీ డైలాగూ మా పార్టీని కించపరుస్తున్నట్టే ఉంది. వాటిని తీసేయాలి అంటూ వాళ్లందరూ బెదిరించారట. సర్దిచెప్పడానికి మోహన్ బాబు ప్రయత్నించినప్పటికీ, వాళ్లు మాట వినలేదట. అసలే ముక్కు మీద కోపం ఉండే మోహన్ బాబుకు సహనం నశించి వాళ్లతో కలబడే సరికి, మిగిలిన యూనిట్ సభ్యులు కూడా చేయికలిపి, కార్యకర్తలను తరిమి కొట్టేశారట. అప్పట్లో అసెంబ్లీ రౌడీ, నిజంగానే మూడు రోజుల పాటు అసెంబ్లీని కుదిపేశాడట. రాజకీయంగా సంచలనం సృష్టించిన ఈ సినిమాను ఆపాలని చాలా మంది ప్రయత్నించినా, ఎట్టకేలకు రిలీజై ప్రేక్షాకదరణ సాధించిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు కలెక్షన్ కింగ్. త్వరలోనే ఈ మూవీని విష్ణు హీరోగా రీమేక్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



