చిరు.. అలా ఫీలవుతున్నాడా?
on Apr 11, 2016

రామ్ చరణ్ - అల్లు అర్జున్ మధ్య 'మెగా' కాంపిటీషన్ నడుస్తోంది. ఒకరిని మించి ఒకరు విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నారు. ఇద్దరికీ మెగా అభిమానుల అండా దండా ఉన్నాయి. అయితే ఈమధ్య చరణ్ జోరు కాస్త తగ్గింది. గోవిందుడు, బ్రూస్లీ పరాజయాలతో బాగా డీలా పడ్డాడు. అయితే బన్నీ వరుస విజయాలతో.. తన స్టార్ డమ్ ని అమాంతం పెంచేసుకొన్నాడు. ఇప్పుడు చరణ్ తో పోలిస్తే బన్నీకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. బన్నీలా చరణ్ ఎందుకు ఎదగలేకపోతున్నాడా అన్న అసంతృప్తి చిరంజీవిలోనూ ఉందని, ఈ విషయంలో చిరు చాలా ఫీలవుతున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి.
అయితే ఈ ఫంక్షన్‌లో చిరంజీవి ప్రవర్తన, ఆయన ముఖ కవళికలు అభిమానుల్ని, అక్కడకు విచ్చేసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. వేదిక పై చిరంజీవి లేని హుషారుని తెచ్చుకోవడానికి ప్రయత్నించినా, ఆడియన్స్ మధ్య కూర్చున్నప్పుడు అన్ ఈజీగా ఫీలయ్యాడు. మొహంపై చిరునవ్వే లేదు. ఈ పోగ్రాం ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు బయటపడతానా అన్నంతగా కుర్చీలో ఇబ్బందిగా కదిలాడు చిరు. పక్కన బన్నీ కూర్చున్నా తనతో అంతగా మాట్లాడింది లేదు. తన ధ్యాసంతా చరణ్ కెరీర్ వైపు మళ్లిందని, చరణ్‌కి కూడా బన్నీలా ఎప్పుడు పైకి వస్తానో అన్న ఆందోళన పెరిగిపోతోందని మెగా కాంపౌండ్ వర్గాలు సైతం చెబుతున్నాయి. చరణ్ ఇప్పుడు ధ్రువ అనే చిత్రంలో నటిస్తున్నాడు. తని ఒరువన్‌కి ఇది రీమేక్. సినిమా హిట్టయితే చిరంజీవి బెంగ కాస్తయినా తగ్గుతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



