మీసం తిప్పుతున్న మెగాస్టార్
on Mar 22, 2017

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ఎవరితో చేస్తాడు..కథ ఏంటి అంటూ ఎన్నో ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథలో చిరు నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇది చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అభిమానులు కూడా నిజమని నమ్మారు. మరో వైపు స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు చాలా రోజుల నుంచి కసరత్తులు చేస్తున్నారు పరచూరి బ్రదర్స్. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ..మెగా 151 మూవీ ఇదే అని టాలీవుడ్ వర్గాలు ఫిక్స్ అయ్యాయి.
అయితే ఆ సినిమాలో చిరంజీవి ఎలా కనిపిస్తారు..? ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో లుక్‌పై చిరు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాడు..ఉయ్యాలవాడలా నాలుగైదు స్కెచ్‌లు రెడీ గీయించాడు. అలా గీయించిన స్కెచ్‌లలో ఒకటి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇది యూనిట్ సభ్యుల గీయించిందో..లేక ఫ్యాన్స్ ఎవరైనా చేశారో తెలియదు గానీ..ఉయ్యాలవాడ గెటప్‌లో ఆయన సూపర్బ్‌గా ఉన్నాడు. ప్రజంట్ ఈ స్కెచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



