చరణ్ వీరాభిమాని పరశురామ్ మృతి
on Jul 15, 2017

సరిగ్గా రెండేళ్ల కిందట ఒక న్యూస్ ఛానెల్‌లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఒడిలో కూర్చొని మగధీర సినిమాలోని డైలాగులు గుక్కతిప్పుకోకుండా చెబుతున్న ఒక చిన్నారి గుర్తున్నాడా..? చిన్నప్పటి నుంచి చెర్రీ అంటే పడిచచ్చిపోయే ఆ బుడతడు చరణ్ సినిమాల్లోని డైలాగ్స్, పాటలు పాడుతూ మీడియా కంట పడటం..ఆ వెంటనే మెగా పవర్‌స్టార్ స్వయంగా తన చిన్నారి అభిమానిని కలుసుకోవడం..పిల్లవాడి చదువుకు అయ్యే ఖర్చును తాను భరిస్తున్నట్లు చెప్పడం అంతా చకచకా జరిగిపోయాయి. ఆ అభిమాని ఇప్పుడు లేడు..అవును మీరు వింటున్నది నిజమే..గత కొంతకాలంగా కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి నిన్న తుదిశ్వాస విడిచాడు..కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగించే పరశురాం కుటుంబసభ్యులు సరైన వైద్యం అందించలేకపోవడంతోనే ఆ చిన్నారి కన్నుమూసినట్లు తెలుస్తోంది. పరశురామ్ మరణవార్తను తెలుసుకున్న రామ్‌చరణ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైనట్లు సమాచారం.
.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



