మెగా ఫ్యామిలీలో విభేధాలు మాయం..?
on Oct 30, 2015
మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా చిన్నగా ఒకటవుతున్నట్టు కనిపిస్తుంది. గత కొద్దికాలంగా మెగా కాంపౌండ్ లో మెగా ఫ్యామీలీస్ మధ్య సఖ్యత అంతగా లేకపోవడం, పరస్పరం విభేధాలు ఉండటం అందరికి తెలుసు. దీనివల్ల చిరంజీవికి బాగానే తెలిసొచ్చినట్టు కనిపిస్తుంది. నిన్నటి మొన్నటి వరకూ చరణ్ బాగోగులు చూసిన చిరంజీవి ఇప్పుడు మళ్లీ అల్లు అరవిందునే అందుకు పురమాయించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చరణ్ కు టైం అంత బాలేదు. ఈ మధ్య ఒక్క సరైన సినిమా కూడా లేదు. దీనికి కాస్తో, కూస్తో కారణం చిరంజీవి కూడా అయిండొచ్చు. సో మళ్లీ అది రిపీట్ అవ్వకుండా ఇక చరణ్ భవిష్యత్ ప్రాజెక్టులను చూసుకోవాల్సిందిగా అల్లు అరవింద్ ను కోరారట.
అంతేకాదు ఎప్పటినుండో దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చిరు ఫ్యామిలికి దగ్గర అవుతున్నట్టు తెలుస్తోంది. గతం నుండే చరణ్ బాబాయ్ ను, నాన్నను కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇద్దరి మధ్య రాయబారిగా వ్యవహరిస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా కలుస్తుండేవాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి బర్త్ డే పార్టీకి రావడం.. బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి నటించినందుకు గాను ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలపడం ఇవన్నీ మెగా ఫ్యామిలీ ఒకటవుతుందని చెప్పడానికి నిదర్శనమే. అంతేకాదు చరణ్ కెరీర్ గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ తన సినిమాను సైతం కూడా పక్కన పెట్టి మరీ చరణ్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ కు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చరణ్ ఫెయిల్యూర్ వల్ల అందరూ ఒకటవుతున్నారు.. ఇది మెగా ఫ్యాన్స్ కు తీపి కబురే..