Home

»

Latest News

సర్దార్ గబ్బర్ సింగ్ కు మెగా బ్రదర్స్ వస్తున్నారా..?

Feb 18, 2016 8:18PM

చిరు 50వ బర్త్ డే ఫంక్షన్ లో నాగబాబు స్పీచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ స్పీచ్ దెబ్బకు, మెగాబ్రదర్స్ మధ్య గొడవలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆరోజు నాగబాబు ఫైరింగ్ ఆ స్థాయిలో ఉంది. కానీ తర్వాత చిరు బర్త్ డే కి ఇంటికెళ్లి విష్ చేసి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికీ చాటి చెప్పాడు పవన్. ఆ తర్వాత చిరు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కు వెళ్లి మరీ పవన్ ను పలకరించారు. దీంతో తమ మధ్య ఉన్న బంధం అలాగే ఉందని చిరు పవన్ లు తమ ఫ్యాన్స్ కు మెసేజ్ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం, సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. మార్చి 12 న  అమరావతిలో భారీ ఎత్తున చేయబోయే ఆడియో రిలీజ్ లో స్పెషల్ గెస్ట్ లుగా చిరంజీవి, నాగబాబులను పిలవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరిగా గబ్బర్ సింగ్ సినిమా టైంలో కలిసి కనిపించిన ఈ ముగ్గురూ ఇప్పుడు మళ్లీ సర్దార్ కు కలవబోతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ కు సర్దార్ ఆడియో ఫంక్షన్ పండగ అనడంలో ఆశ్చర్యం లేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com