Home

»

Latest News

నా జీవిత‌మే క్ర‌ష్ అయిపోయింది.. ల‌వ్ క్ర‌ష్‌పై మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌.!

Nov 23, 2026 4:30PM

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ప్రేమ, రిలేషన్‌షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్వ్యూలో యాంకర్ మీనాక్షిని ప్రస్తుతం ఎవరిపైనైనా క్రష్ ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఆమె నవ్వుతూ తనకు ఎవరిపైనా క్రష్ లేదని సమాధానం ఇచ్చారు. అంతేకాదు.. తన జీవితమే క్రష్ అయిపోయిందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వరుస సినిమాలు, షూటింగులు, ప్రమోషన్లతో బిజీగా ఉండటం వల్ల వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతున్నాననే విషయాన్ని ఆమె చమత్కారంగా చెప్పుకొచ్చారు.

ఇక ప్రేమ, రిలేషన్‌షిప్స్ గురించి అడిగిన ప్రశ్నకు కూడా మీనాక్షి ఆసక్తికరంగా స్పందించారు. ప్రేమలో పడటం ఎంత కష్టమో, బ్రేకప్ నుంచి బయటపడటం కూడా అంతే కష్టమని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే తన ప్రేమ వ్యవహారాల గురించి ఆమె ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉన్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

ఇక మీనాక్షి చౌదరి నటిస్తున్న ‘వృషకర్మ’ విషయానికి వస్తే.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 25న నెల్లూరులో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది.

 

 

[MeenakshiChaudhary, Naga Chaitanya, Vrushakarma, Tollywood Heroines]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com