Home

»

Latest News

బాలమురళీ గారు వీణ ఎందుకు వాయించరు..?

Nov 23, 2016 11:02AM

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, జాతి గర్వించదగ్డ సంగీత మేరుశిఖరం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఇక లేరన్న వార్తను సంగీత ప్రియులు ముఖ్యంగా తెలుగువారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పెద్ద పెద్ద చదువులు చదవలేదు..చదివింది కేవలం మూడో తరగతి..ఎవరి దగ్గరా సంగీతం నేర్చుకోలేదు..అలా పాడేశారు..సంగీత సాధనాలపై కుస్తీ పట్టలేదు..మృదంగం వాయించాలనిపించింది..వాయించేశారు..వయోలిన్ వాయించాలనుకున్నారు వాయించేశారు. ఎవరి దగ్గరా నేర్చుకోకుండా ఎలా వచ్చింది అని అందరికి సందేహం కలగవచ్చు..ఇదే ప్రశ్న ఆయన్ను అడిగితే మృదంగానికి సంగీతం వచ్చా... వయోలిన్‌కి సంగీతం వచ్చా..? మనం మీటితే స్వరాలు పలకవూ.. అంటారాయన. అయితే అన్ని రకల సంగీత పరికరాలు వాయించినా వీణను మాత్రం బాలమురళీ వాయించరు. అదే వీణ.. మా అమ్మగారు వీణ వాయించేవారు..అందుకని నాన్న వీణ వాయించవద్దని నా దగ్గర మాట తీసుకున్నారు..ఆ మాట కోసం ఈనాటి వరకు ఆయన వీణ ముట్టలేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com