Home

»

Latest News

టీజ‌ర్ రివ్యూ : ల‌క్కున్నోడు

Nov 23, 2016 10:31AM

మంచు విష్ణు  వినోదాన్ని న‌మ్ముకొన్న ప్ర‌తీసారీ విజ‌యం ద‌క్కింది. త‌న తొలి హిట్‌.. ఢీ అందుకు సాక్ష్యం. దేనికైనా రెడీ, ఈడో ర‌కం, ఆడోర‌కం... ఇవ‌న్నీ కామెడీని న‌మ్ముకొన్న సినిమాలే. ఈసారీ అదే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.. ల‌క్కున్నోడు సినిమాతో.  త్రిపుర ద‌ర్శ‌కుడు రాజ్ కిర‌ణ్ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. హ‌న్సిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈరోజు మంచు విష్ణు పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. సాధార‌ణంగా ప్ర‌తీ సినిమాలోనూ త‌న కండ‌ల‌కు ప‌ని చేబుతుంటాడు విష్ణు. ఈసారి మాత్రం కామెడీ పంచ్‌ల‌తో స‌రిపెట్టుకొన్నాడు.

'‌ల‌క్ న‌న్ను హ‌గ్ ఇచ్చే లోగా.. అన్ ల‌క్ న‌న్ను లిప్ లాక్ చేసి వెళ్లిపోతుంది` అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. దాన్ని బ‌ట్టి ఈ సినిమాలో క‌థానాయ‌కుడి క్యారెక్ట‌రైజేష‌న్ ఏమిటో అర్థ‌మైపోతోంది. పేరుకు ల‌క్కీ అయినా...ల‌న్ ల‌క్కీ ఫెలో క‌థ ఇది. ఈ పాయింట్‌ని ఫోక‌స్ చేసింది టీజ‌ర్‌. విష్ణు త‌ప్ప‌.. ఇంకెవ్వ‌రన్నీ టీజ‌ర్‌లో హైలెట్ చేయ‌లేదు. బ‌హుశా... ఇది విష్ణు పుట్టిన రోజు టీజ‌ర్ కాబ‌ట్టి.. కాబోలు. ఆఖ‌రికి హ‌న్సిక కూడా ఒక‌ట్రెండు ఫ్రేముల్లోనే క‌నిపించింది. ల‌క్కున్నోడు కామెడీ సినిమా అయినా.. ఆ పంచ్‌లు స‌రిగా పేల‌లేద‌నిపిస్తోంది. మ‌రి థియేట‌ర్లో అయినా న‌వ్విస్తాడో లేదో చూడాలి. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com