ప్రభాస్ ఫ్యాన్స్‌కి షాక్.. క్షమాపణ చెప్పిన మంచు విష్ణు!
on Mar 29, 2025
భక్త కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు కన్నప్పగా నటిస్తున్న భారీ చిత్రాన్ని మోహన్‌బాబు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్టు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన సూపర్‌స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తుండగా.. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ చేసారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంచు విష్ణు ఒక షాకింగ్ న్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
‘కన్నప్ప’ సినిమా విడుదలను అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతున్నామని తెలియజేస్తూ ఒక లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రేక్షకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు క్షమించాల్సిందిగా ఆ లెటర్‌లో పేర్కొన్నారు. తనతోపాటు యూనిట్‌లోని అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా చేస్తున్నామని, ప్రేక్షకులకు మంచి థియేట్రిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇంకా కొన్ని సీన్స్‌కి విఎఫ్‌ఎక్స్ పూర్తి కావాల్సి ఉందని, అది పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. అందుకే సినిమాను కొంతకాలం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని మంచు విష్ణు ఆ లెటర్‌లో పేర్కొన్నారు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి చేయడానికి ఇంకాస్త సమయం అవసరం అవుతోందని, అందుకే వాయిదా వేస్తున్నామని విష్ణు నోట్ లో పేర్కొన్నారు. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
