మంచు విష్ణు సిబ్బంది అడవి పందిని ఎందుకు వేటాడారు
on Dec 31, 2024
మంచు మోహన్ బాబు(mohan babu)కుటుంబం కొన్ని సంవత్సరాల నుంచి రంగారెడ్డి జిల్లా జల్లేపల్లి లో నివాసం ఉంటుంది.కుమారులైన మంచు విష్ణు,మనోజ్ కూడా అక్కడే నివాసముంటున్నారు.జల్లేపల్లి సమీపాన ఒక అడవి ఉంది.
మంచు విష్ణు(vishnu)కి సంబంధించిన సిబ్బంది అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడి తీసుకెళ్తున్నారు.మేనేజర్ కిరణ్,ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ చెరో వైపున ఉండి ఒక కర్ర మధ్య అడవి పందిని బంధించి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.దీంతో ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఆ ఇద్దరి చర్యలని తప్పుపడుతు మనోజ్(manoj)పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా వాళ్ళు వినలేదని సమాచారం.మీడియా పర్సన్ పై దాడి చేసిన కేసులో మోహన్ బాబు పరారీలో ఉన్నట్టుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్యామిలీకి తమ మనుషులు అడవిలో జంతువులని వేటాడి చంపిన విషయం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది.సెక్షన్ 428 ,429 కింద నేరం అవుతుంది
Also Read