మంచు ఫ్యామిలీలో మళ్ళీ టెన్షన్ టెన్షన్.. యూనివర్సిటీ సాక్షిగా ముగ్గురూ...
on Jan 15, 2025
ఇటీవల మంచు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒక వైపు.. మంచు మనోజ్ ఒక వైపు అన్నట్టుగా సినిమా సన్నివేశాలను తలపించేలా గొడవలు జరిగాయి. ఈ గొడవలకు ప్రధాన కారణం మోహన్ బాబు యూనివర్సిటీ అనే విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులుగా ఈ గొడవలు సద్దుమణిగాయి, ఇక అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో.. మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మోహన్ బాబు యూనివర్సిటీ సాక్షిగా ముగ్గురూ ఎదురుపడబోతున్నారని తెలుస్తోంది.
మోహన్ బాబు కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు. పెద్ద కుమారుడు విష్ణు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలో ఘనంగా భోగి సంబరాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ రంగంలోకి దిగుతున్నాడు. నేడు రంగంపేటలో జరగనున్న జల్లికట్టు వేడుకల్లో మనోజ్ పాల్గొనబోతున్నాడు. అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీకి మనోజ్ వెళ్తాడని సమాచారం. ఇప్పటికే యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు, విష్ణు ఉండటంతో.. మనోజ్ రాకతో అక్కడ ఎలాంటి టెన్షన్ వాతావరం నెలకొంటుందోనన్న చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు మనోజ్ రాకపై అలెర్ట్ అయిన పోలీసులు యూనివర్సిటీ వద్ద ఎటువంటి వివాదం జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read