నాకు ఆ హెల్ప్ చేయండి ప్లీజ్.. మంచు లక్ష్మి ఇలా అడిగిందేంటి..!
on Jul 5, 2024
మామూలుగా సామాన్యులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను హెల్ప్ అడగడం చూస్తుంటాం. కానీ ఒక సెలబ్రిటీ సామాన్యులను హెల్ప్ అడగడం చాలా అరుదు. తాజాగా ప్రముఖ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) అలాంటి అరుదైన పనే చేసింది. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అడిగింది.
"నిరాశలో సహాయం కోసం ఎదురుచూస్తున్నా. నా వీసా నెలరోజుల క్రితం అప్రూవ్ అయింది.. కానీ నాకు ఇప్పటికీ అది అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగుస్తున్నాయి. జూలై 17న నా ఫ్లైట్ ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో, వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా సహాయం చేయగలరా?" అని ఇన్ స్టాగ్రామ్ లో మంచు లక్ష్మి పోస్ట్ చేసింది.
అయితే మంచు లక్ష్మి ఇలా అడగడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె సెలబ్రిటీ.. ఎంతో పలుకుబడి, డబ్బు ఉన్నాయి. అలాంటి మంచు లక్ష్మి.. ఇలా సోషల్ మీడియా వేదికగా సామాన్యులను హెల్ప్ చేయమని అడగడం ఏంటని అందరూ షాకవుతున్నారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)