మన శంకర వరప్రసాద్ గారు.. తెలుగునాట దిమ్మతిరిగే బిజినెస్!
on Oct 12, 2025

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నారు. అసలే మెగాస్టార్ మూవీ, దానికితోడు 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా, పైగా వెంకటేష్ ప్రత్యేక పాత్ర.. ఇన్ని ప్రత్యేకతలు ఉండటంతో 'మన శంకర వరప్రసాద్ గారు'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే భారీ బిజినెస్ జరిగే అవకాశం కనిపిస్తోంది. (Mana Shankara Varaprasad Garu)
'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026 జనవరి 12న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ఇంకా మూడు నెలలు సమయముంది. అప్పుడే థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించిన చర్చలు మొదలైనట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం నిర్మాతలు రూ.130 కోట్లు కోట్ చేస్తున్నట్లు సమాచారం. నైజాంలో రూ.45 కోట్లు, ఆంధ్రాలో రూ.62 కోట్లు, సీడెడ్ లో రూ.23 కోట్లు కోట్ చేస్తున్నారట. రూ.110-120 కోట్ల మధ్య తెలుగు స్టేట్స్ బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. సంక్రాంతి సీజన్, పైగా చిరు-అనిల్ కాంబో కావడంతో హిట్ టాక్ వస్తే.. ఈ టార్గెట్ పెద్ద మేటర్ ఏమీ కాదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



