డాన్ కోసం స్లిమ్ అయిన సూపర్ స్టార్
on Feb 17, 2014
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వయసు 62. ఈ వయసులో ఉన్న ఏ నటీనటులైన కూడా కొంచెం రిస్క్ తీసుకొని చేసే సినిమాలకు దూరంగా ఉంటారు. కానీ మమ్ముట్టి మాత్రం ఒక సినిమా కోసం ఏకంగా 10కిలోల బరువు తగ్గారు. దీనికోసం కఠినమైన వ్యాయామాలు, డైటింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం మమ్ముట్టి "గ్యాంగ్ స్టర్" అనే చిత్రంలో అండర్ వరల్డ్ డాన్ గా చేస్తున్నారు. ఇందులో డాన్ అక్బర్ ఆలీఖాన్ పాత్రలో నటించారని, ఆయన పదేళ్ళ వయసు తగ్గినట్టుగా కనిపిస్తున్నారని చిత్ర దర్శకుడు ఆషిక్ అబు పేర్కొన్నారు