ఇండియన్ హీరోల్లో మమ్ముట్టినే తోపు..సాక్ష్యం కూడా ఉంది
on May 1, 2024
మమ్ముట్టి..మలయాళ సినీ రంగంలో తిరుగులేని కథానాయకుడు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే మాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఫస్ట్ మూవీ అనుభవంగల్ పాలిచకల్ 1971 లో విడుదల అయ్యింది. అప్పుడు ఆయన వయస్సు 20 సంవత్సరాలు. దాన్ని బట్టి ఆయన సినీ జర్నీ ని అర్ధం చేసుకోవచ్చు. సామ్రాజ్యం, దళపతి, స్వాతి కిరణం లాంటి విభిన్న సినిమాలతో తెలుగు వారికి కూడా అభిమాన కధానాయకుడు గా కూడా మారాడు . రీసెంట్ గా ఆయన ఒక రికార్డు సృష్టించాడు.అంతే కాకుండా ఎంతో మంది అగ్ర హీరోలకి ఆదర్శంగా నిలిచాడు. .
ప్రస్తుతం స్టార్ హీరో సినిమా రెండేళ్లకో,మూడేళ్లకో ప్రేక్షకులని పలకరిస్తుంది. ఎనీ లాంగ్వేజ్ తీసుకున్నా ఇదే పరిస్థితి కానీ మమ్ముట్టి ఈ పద్ధతిని మారుస్తు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. కేవలం తొమ్మిదంటే తొమ్మిది నెలల్లో ఐదు సినిమాలు రిలీజ్ చేసి సరికొత్త ప్రభంజనాన్నే సృష్టించాడు. డిఫరెంట్ కంటెంట్ తో కూడిన ఆ చిత్రాలన్నీ సక్సెస్ ని కూడా సాధించాయి. కన్నూర్ స్క్వాడ్ సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది, కాదల్ ది కోర్ నవంబర్ 23న , అబ్రహం ఓజ్లర్ ఈ ఏడాది జనవరి న రిలీజ్ అయ్యింది. భ్రమ యుగం ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యింది.
ఇప్పుడు టర్బో గా రాబోతున్నాడు. వాస్తవానికి ఈ మూవీ జూన్ 13న రిలీజ్ అవ్వాలి. కానీ మే 23నే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బజూక అనే ఇంకో చిత్రం కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది. సోషల్ మీడియాలో మమ్ముట్టి ఐదు సినిమాల న్యూస్ బాగానే వైరల్ అవుతుంది. దీంతో అన్ని బాషల కి చెందిన హీరోలు మమ్ముట్టి ని ఆదర్శంగా తీసుకోవాలని అభిమానులు, సినీ ప్రేమికులు కోరుతున్నారు. అన్ని లాంగ్వేజ్ లని కలుపుకొని సుమారు 400 చిత్రాలకి పైనే మమ్ముట్టి నటించాడు
Also Read