విశ్వంభర జోనర్ కథలోనే బాలకృష్ణ,రామ్ చరణ్ సినిమా!
on Apr 12, 2025

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం వశిష్ట(Vasishta)దర్శకత్వంలో చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'(Vishwambhara)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.చిరు గత చిత్రం భోళాశంకర్ పరాజయం చెందటంతో మెగా అభిమానుల ఆశలన్నీ'విశ్వంభర' పైనే ఉన్నాయి.హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు ఫస్ట్ సింగిల్ గా 'రామరామ' సాంగ్ రిలీజై మూవీపై అందరిలో అంచనాలు పెంచేసింది.యువి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి,ప్రమోద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
రీసెంట్ గా వశిష్ట తండ్రి ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి(Mallidi Satyanarayana reddy)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు విశ్వంభరకి ముందు అదే జోనర్ లోనే రాసుకున్న కథల్నిబాలకృష్ణ గారికి,చరణ్ గారికి వశిష్ట చెప్పడం జరిగింది.వాళ్లిద్దరు చేస్తామని కూడా చెప్పారు.కాకపోతే ఆ ఇద్దరు అంతకుముందే ఒప్పుకున్న సినిమాలు డిలే అవ్వడం వల్ల కుదరలేదు.లేదంటే విశ్వంభర కంటే ముందే బాలకృష్ణ,చరణ్ సినిమాలు ఉండేవి. ఆ తర్వాత చిరంజీవి గారు కథలు వింటున్నారని వంశీ కృష్ణారెడ్డి చెప్పడంతో చిరంజీవి గారికి వశిష్ట కథ చెప్పడం,విశ్వంభర అనౌన్స్ మెంట్ జరగడం అయ్యిందని చెప్పుకొచ్చాడు.
అన్వేషణ,సకుటుంబసపరివారసమేతం,బన్నీ,భగీరధ,ఢీ వంటి పలు చిత్రాలు సత్యనారాయణ రెడ్డి నిర్మాణ సారధ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇక వశిష్ట ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో 'బింబిసార' తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



