Home

»

Latest News

మ‌హేశ్ రేర్ రికార్డ్‌!

Mar 13, 2020 5:53PM

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ ఒక అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఒకే థియేట‌ర్‌లో కోటి రూపాయ‌లు పైగా షేర్ సాధించిన సినిమాల సంఖ్య‌లో టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్‌గా నిలిచాడు. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సుద‌ర్శ‌న్ 35 ఎంఎం థియేట‌ర్‌లో విడుద‌లైన మ‌హేశ్ సినిమాల‌లో 6 సినిమాలు కోటి రూపాయ‌ల పైగా షేర్ సాధించడం విశేషం. టాలీవుడ్‌లో మ‌రే హీరోకూ ఈ రికార్డ్ లేక‌పోవ‌డం విశేషం. 

సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో కోటి రూపాయ‌ల పైగా షేర్ సాధించిన మ‌హేశ్ సినిమాలు, వాటి క‌లెక్ష‌న్ వివ‌రాలు..
పోకిరి (2006) - 1.63 కోట్లు
ఒక్క‌డు (2003) -  1.58 కోట్లు
మురారి (2001) -  1.20 కోట్లు
స‌రిలేరు నీకెవ్వ‌రు (2020) - 1.05 కోట్లు
అత‌డు (2005) - 1.04 కోట్లు
మ‌హ‌ర్షి (2019) - 1 కోటి

వీటిలో 'మ‌హ‌ర్షి', 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాల‌తో వ‌రుస‌గా రెండేళ్లు కోటి రూపాయ‌లు పైగా ఈ థియేట‌ర్‌లో షేర్ సాధించ‌డం మ‌హేశ్ ప్ర‌స్తుత ఫామ్‌కు నిద‌ర్శ‌నం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com