మహేశ్ సినిమాలో అంతా "అరవ" సరుకే..!
on Dec 13, 2016

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-మురగదాస్ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ చాలా స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హీరో మహేశ్, హీరోయిన్ రకుల్ తప్ప అంతా అరవ బ్యాచ్చే. డైరెక్టర్, విలన్ , టెక్నిషీయన్స్ అంతా చెన్నై సరుకే ...ఇది చాలదన్నట్లు తాజాగా మరో తమిళ హీరోను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తుంది. "బాయ్స్" సినిమా ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చి "ప్రేమిస్తే" మూవీతో ఫేమస్ అయిన "భరత్" ఈ మూవీలో ఓ కీ రోల్ చేయబోతున్నాడట.
ఇప్పటికే సినిమా అంతా తమిళ వాసన ఎక్కువైందని..అంత అవసరమైతే తెలుగు హీరోల్లో ఎవరినైనా తీసుకోవచ్చు కదా అని మహేశ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికి చిత్రయూనిట్ స్పందన వేరుగా ఉంది...సూపర్‌స్టార్‌కు తెలుగులో తిరుగులేదు కానీ ద్విభాషా చిత్రం అయినందున తమిళ ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే అక్కడి వారితో నటింపజేస్తే సినిమాకు అడ్వాంటేజ్ అవుతుందని వారు వాదిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి "సంభవామి" అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



