బాలయ్య 'అఖండ' విజయం.. మహేష్ బాబు ఫుల్ హ్యాపీ!
on Dec 2, 2021
నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ 'అఖండ'కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ లాక్డౌన్ తర్వాత వచ్చిన తొలి భారీ బడ్జెట్ మూవీ కావడంతో అఖండ థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. బాలయ్య అభిమానులు, మాస్ ప్రేక్షకులు థియేటర్స్ కి భారీగా తరలి వెళ్తున్నారు. 'అఖండ'కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమా బాలయ్య ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ లోనూ కొత్త ఉత్సాహం నింపుతోంది. దీంతో టాలీవుడ్ స్టార్స్ అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ మూవీకి పాజిటివ్ టాక్ రావడంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు. అఖండ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందంగా ఉందని మహేష్ అన్నాడు. అలాగే బాలకృష్ణ, బోయపాటితో పాటు ఇతర మూవీ టీమ్ కి మహేష్ శుభాకాంక్షలు చెప్పాడు. మహేష్ ట్వీట్ చేయడంపై హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ సంతోషం వ్యక్తం చేసింది. థ్యాంక్యూ సార్ అంటూ రిప్లై ఇచ్చింది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నేచురల్ స్టార్ నాని కూడా అఖండ మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై సంతోషం వ్యక్తం చేశారు. మూవీ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన అఖండలో బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించాడు.
హ్యాట్రిక్ కొట్టేశారు.. బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి తెలుసు!
Also Read