శ్రీదేవి మరణంపై మహేశ్, ఎన్టీఆర్ షాక్
on Feb 25, 2018
.jpg)
అతిలోకసుందరి శ్రీదేవి మరణ వార్త భారతీయ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆమె మరణం పట్ల సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రపరిశ్రమతో శ్రీదేవికి అవినాభావ సంబంధం ఉంది. బాలనటిగా.. స్టార్ హీరోయిన్‌గా ఆమె ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. శ్రీదేవి లేని లోటు పూడ్చలేనిదని.. ఆమె స్థానాన్ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేరని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. దివి నుంచి భువికి దిగివచ్చిన ఆమె.. విజయాలన్నీ సాధించిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో.. అక్కడికే తిరిగి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్..
ఈ వార్త విని నేను షాక్ అవ్వడంతో పాటు డిస్ట్రబ్ అయ్యానని.. మా కుటుంబానికి శ్రీదేవిగారు ఎంతో కావల్సిన వ్యక్తని అన్నారు సూపర్‌స్టార్ మహేశ్. ఆమె అద్భుతమైన నటే కాదు.. అద్భుతమైన వ్యక్తిత్వమున్న మహిళగా అభివర్ణించారు. శ్రీదేవి కుటుంబంతో పాటు ఆమెను ప్రేమించే ప్రతి ఒక్కరికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని మహేశ్ ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



