మళ్లీ పివిపి మహేష్ సినిమా..?
on May 27, 2016
ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ. ఒక భారీ డిజాస్టర్ పడిన హీరో, నిర్మాత మళ్లీ కలిసి సినిమా చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కానీ మహేష్ బాబుకు మాత్రం సెంటిమెంట్స్ కంటే ఫీలింగ్స్ ఎక్కువ. అందుకే తనతో బ్రహ్మోత్సవం లాంటి ఫ్లాప్ తీసిన పివీపీ కీ మరో సినిమా చేసే అవకాశం ఇఛ్చాడట. సినిమా బయ్యర్లు బ్రహ్మోత్సవంతో భారీగా నష్టపోవడంతో పాటు, పివిపీ కూడా దాదాపు వంద కోట్ల లాస్ లో నడుస్తున్నాడట. అందుకే ప్రొడ్యూసర్ కు సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో మరో సినిమా చేద్దామని మాటిచ్చాడట మహేష్. అయితే ఈసారి డైరెక్టర్ గా ఈ మధ్యే పివిపితో ఊపిరి తీసి హిట్ కొట్టిన వంశీ పైడిపల్లిని ఎంచుకున్నాడట మహేష్. అఖిల్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో, తన దగ్గరున్న కాన్సెప్ట్ ను మహేష్ కు వినిపించాడట వంశీ. అది నచ్చడంతో సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, త్వరలోనే ఈ సినిమాకు ముహూర్తం నిర్ణయించబోతున్నారని గుసగుసలాడుతున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ఈ సినిమాతోనైనా పివిపి గట్టెక్కుతాడేమో చూడాలి.